బాబును సమర్ధించే మేధావులు దీనికేమంటారో....
కేవలం టీడీపీ పత్రికలు మాత్రమే చదివే వారు…. కొందరు మేధావులు… చంద్రబాబు దార్శనికుడండి… చంద్రబాబుకు అపార అనుభవం ఉందండి… ఆయన రాష్ట్రానికే పెద్ద కొడుకులాంటి వారు… అంటూ రకరకాలుగా కథలు చెబుతుంటారు. మీడియా మాయలో పడి బాబు లేకుంటే రాష్ట్రం ఏమైపోతుందో అన్నంతగా బాధపడుతుంటారు. మేధావులైతే మీడియా చానళ్లకు ఎక్కి బాబు భజన చేస్తూ జనాన్ని గొర్రెల్లా భావించి అటు మళ్లించేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ మేధావులకు చంద్రబాబు చేసే అప్రజాస్వామిక పనులు వినిపించవు, కనిపించవు. టీడీపీ పత్రికలు మాత్రమే చదివే వారికి అవి […]
కేవలం టీడీపీ పత్రికలు మాత్రమే చదివే వారు…. కొందరు మేధావులు… చంద్రబాబు దార్శనికుడండి… చంద్రబాబుకు అపార అనుభవం ఉందండి… ఆయన రాష్ట్రానికే పెద్ద కొడుకులాంటి వారు… అంటూ రకరకాలుగా కథలు చెబుతుంటారు.
మీడియా మాయలో పడి బాబు లేకుంటే రాష్ట్రం ఏమైపోతుందో అన్నంతగా బాధపడుతుంటారు. మేధావులైతే మీడియా చానళ్లకు ఎక్కి బాబు భజన చేస్తూ జనాన్ని గొర్రెల్లా భావించి అటు మళ్లించేందుకు ప్రయత్నిస్తుంటారు.
అయితే ఈ మేధావులకు చంద్రబాబు చేసే అప్రజాస్వామిక పనులు వినిపించవు, కనిపించవు. టీడీపీ పత్రికలు మాత్రమే చదివే వారికి అవి తెలుసుకునే అవకాశం కూడా ఉండదు.
ప్రమాణస్వీకారం సమయంలో ఒక ముఖ్యమంత్రిగా పక్షపాతం లేకుండా పనిచేస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన చంద్రబాబు… ఇప్పుడు పచ్చిగా బహిరంగ సభలలోనే తాను పక్షపాతంతో పనిచేశానని ప్రకటించుకుని చిరునవ్వులు
నవ్వుతున్నారు.
కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన చంద్రబాబు బహిరంగ సభలో ప్రజల సాక్షిగా… తాను వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులు చేయలేదని ప్రకటించారు.
ఇటీవలే టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరితను పక్కన నిలబెట్టుకుని ప్రసంగం చేసిన చంద్రబాబు… గౌరు చరిత వచ్చి నియోజక వర్గంలో పనులకు సంబంధించి విజ్ఞప్తులు ఇచ్చారని చెప్పారు. కానీ ఆమె మరో పార్టీలో ఉన్నారు కాబట్టి పనులు చేయనని స్పష్టంగా చెప్పానని చంద్రబాబు ప్రకటించారు.
ఒక ముఖ్యమంత్రిగా చేయకూడని పని చేసి… దాన్ని బహిరంగ సభలో వెల్లడించిన చంద్రబాబు చిరునవ్వు నవ్వారు. అంటే ప్రతిపక్ష పార్టీ గెలిచిన నియోజక వర్గాల్లోని ప్రజలపై తాను వివక్ష చూపానని ప్రకటించుకున్న ముఖ్యమంత్రిని మేధావులు ఎలా సమర్ధిస్తారో!.