సిగ్గుపడుతున్న కమ్యూనిస్టు కార్యకర్తలు
జనసేనతో పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలో దిగుతున్న కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి అవమానకరంగా తయారైంది. ఈ పరిస్థితిని చూసి కమ్యూనిస్టు కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. తమ రాష్ట్ర నాయకత్వాలపై లోలోన రగిలిపోతున్నారు. స్వప్రయోజనాల కోసం పార్టీ సిద్ధాంతాలను, పార్టీ పరువును తాకట్టు పెట్టేశారని ఆగ్రహిస్తున్నారు. పొత్తులో భాగంగా సీపీఐ, సీపీఎంలకు పవన్ కల్యాణ్ చెరో ఏడు అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. ఒక్కో పార్టీకి ఒక్కో ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా… ఏపీలో అసలు ఆనవాళ్లు కూడా లేని బీఎస్పీకి ఏకంగా 21 స్థానాలను పవన్ […]
జనసేనతో పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలో దిగుతున్న కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి అవమానకరంగా తయారైంది. ఈ పరిస్థితిని చూసి కమ్యూనిస్టు కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. తమ రాష్ట్ర నాయకత్వాలపై లోలోన రగిలిపోతున్నారు. స్వప్రయోజనాల కోసం పార్టీ సిద్ధాంతాలను, పార్టీ పరువును తాకట్టు పెట్టేశారని ఆగ్రహిస్తున్నారు.
పొత్తులో భాగంగా సీపీఐ, సీపీఎంలకు పవన్ కల్యాణ్ చెరో ఏడు అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. ఒక్కో పార్టీకి ఒక్కో ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా… ఏపీలో అసలు ఆనవాళ్లు కూడా లేని బీఎస్పీకి ఏకంగా 21 స్థానాలను పవన్ కల్యాణ్ కేటాయించారు. మూడు ఎంపీ సీట్లు ఇచ్చారు.
ఏపీలో సుధీర్ఘ చరిత్ర ఉన్న తమకు ఏడు స్థానాలే కేటాయించి, బీఎస్పీకి ఏకంగా 21 స్థానాలు కేటాయించినా కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నాయకులు మాత్రం నోరు విప్పకపోవడం చర్చనీయాంశమైంది.
బీఎస్పీకి 21 స్థానాలు ఇచ్చి కమ్యూనిస్టులకు కేవలం ఏడు చొప్పున ఇవ్వడం అవమానించడమేనని కమ్యూనిస్టు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ చేసిన పనిపై తమ నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదో అర్థం కావడం లేదంటున్నారు. బీఎస్పీకి ఇచ్చిన సీట్లతో పోల్చుకుంటే కమ్యూనిస్టు నాయకులు సిగ్గుపడాల్సిన అంశమని ఆ పార్టీ కార్యకర్తలే ఆవేదన చెందుతున్నారు.