బాబు పత్రికలో భలే కథనం...

చంద్రబాబు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో గానీ… ఆయనకు ఆ రెండు పత్రికల అండదొరకడం నిజంగా పూర్వజన్మసుకృతమే. ఎన్నికలు సమీస్తున్న కొద్దీ ఆ రెండు పత్రికలు ముసుగులు తీసి బాబు రక్షణగా కలాల స్థానంలో కత్తులు తిప్పుతున్నాయి. చంద్రబాబు రెండో పత్రిక అయితే మరీను. పలువురు టీడీపీ నేతలు టికెట్లు వచ్చిన తర్వాత కూడా పోటీ నుంచి విరమించుకుంటున్నారు. మరికొందరు ప్రచారానికి వెళ్లే సాహసం కూడా చేయడం లేదు. అయితే బాబు రెండో పత్రిక మాత్రం… దాన్ని కూడా సానుకూల కోణంలో చూపించి బాబు చెప్పినట్టు సంక్షోభంలో […]

Advertisement
Update:2019-03-19 06:24 IST

చంద్రబాబు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో గానీ… ఆయనకు ఆ రెండు పత్రికల అండదొరకడం నిజంగా పూర్వజన్మసుకృతమే. ఎన్నికలు సమీస్తున్న కొద్దీ ఆ రెండు పత్రికలు ముసుగులు తీసి బాబు రక్షణగా కలాల స్థానంలో కత్తులు తిప్పుతున్నాయి. చంద్రబాబు రెండో పత్రిక అయితే మరీను.

పలువురు టీడీపీ నేతలు టికెట్లు వచ్చిన తర్వాత కూడా పోటీ నుంచి విరమించుకుంటున్నారు. మరికొందరు ప్రచారానికి వెళ్లే సాహసం కూడా చేయడం లేదు. అయితే బాబు రెండో పత్రిక మాత్రం… దాన్ని కూడా సానుకూల కోణంలో చూపించి బాబు చెప్పినట్టు సంక్షోభంలో అవకాశాలు వెతుక్కునే ప్రయత్నం చేసింది.

ఎందుకు టీడీపీ అభ్యర్థులు, నేతలు ప్రచారంలో దూకుడుగా వెళ్లకుండా నిరాశలో ఉన్నారన్న దానికి కొత్త భాష్యం చెప్పింది ఆ పత్రిక. గెలుపుపై ధీమా ఎక్కువవడం వల్లే యుద్ధానికి ముందే టీడీపీ నేతలు, అభ్యర్థులు రిలాక్స్ అయ్యారని చంద్రబాబు రెండో పత్రిక తొలి పేజీలో వాదించింది.

పైన బాబున్నారు… కింద సంక్షేమ పథకాల బలం ఉంది .. గెలుపు మనదే అన్న ధీమాతో టీడీపీ అభ్యర్థులు ప్రచారాన్ని లైట్ తీసుకున్నారట. ఒకవేళ నిజంగా ప్రచారం చేయకుండానే గెలిచే పరిస్థితి ఉంటే… అభ్యర్థులు అలాంటి సమయంలో
మరింత ఉత్సాహంగానే దూసుకెళ్తారు.

అందులోనూ ఎన్నికలకు 23 రోజులు ఉన్న సమయంలో అభ్యర్థులు రిలాక్స్ అయ్యారంటే అది బలం కాదు భయం. పరోక్షంగా టీడీపీ శ్రేణులు నిరాశలో ఉన్నాయి… ప్రచారం కూడా చేయడం లేదు.. కాబట్టి మేల్కోండి అని చాటేందుకు సదరు పత్రిక ఇలా రివర్స్‌లో కథనం రాసినట్టుగా ఉంది.

Tags:    
Advertisement

Similar News