పార్టీలు చేస్తాను.... అందుకే అందరికీ నేనంటే ఇష్టం

ప్రభాస్ ను డార్లింగ్ అంటాం. కానీ రియల్ లైఫ్ లో అందరికీ డార్లింగ్ మాత్రం రానా. అవును.. సీనియర్, జూనియర్ అనే తేడాలేకుండా అందరితో ఇట్టే కలిసిపోతాడు రానా. పైగా పార్టీల్లో అందర్నీ కలుపుకొని పోతాడు. అదే తనకు ప్లస్ పాయింట్ అంటున్నాడు ఈ హీరో. ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన సందర్భంగా మీడియాతో మాట్లాడిన రానా.. పార్టీల విషయంలో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. “అవార్డు వేడుకల్లో నన్ను ఎక్కువగా తీసుకోవడానికి […]

Advertisement
Update:2019-03-19 15:30 IST

ప్రభాస్ ను డార్లింగ్ అంటాం. కానీ రియల్ లైఫ్ లో అందరికీ డార్లింగ్ మాత్రం రానా. అవును.. సీనియర్, జూనియర్ అనే తేడాలేకుండా అందరితో ఇట్టే కలిసిపోతాడు రానా. పైగా పార్టీల్లో అందర్నీ కలుపుకొని పోతాడు. అదే తనకు ప్లస్ పాయింట్ అంటున్నాడు ఈ హీరో.

ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన సందర్భంగా మీడియాతో మాట్లాడిన రానా.. పార్టీల విషయంలో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

“అవార్డు వేడుకల్లో నన్ను ఎక్కువగా తీసుకోవడానికి కారణం పార్టీస్ బాగా రన్ చేస్తాను కాబట్టి. కాసేపు స్టేజ్ మీద కనిపించి, ఆ తర్వాత పార్టీస్ రన్ చేస్తుంటాను. అవార్డ్ షోస్ లో నా రెగ్యులర్ జాబ్ అది. నాకు అలా పార్టీస్ చేయడం చాలా ఇష్టం. చాలా తక్కువ సందర్భాల్లో అలా అందరం కలుస్తాం కదా, పార్టీ చేయాల్సిందే. పార్టీస్ లో అందర్నీ కలుపుకుపోతాను. వీళ్లు వాళ్లు అనే తేడా లేదు.”

ప్రస్తుతం ఈ హీరో హాథీ మేరీ సాథీ అనే సినిమా చేస్తున్నాడు. ఆ మూవీ కోసమే ప్రత్యేకంగా మేకోవర్ కూడా అయ్యాడు. హిందీతో పాటు సౌత్ లోని అన్ని భాషల్లో ఈ మూవీ విడుదలకానుంది. తెలుగులో ఈ సినిమాకు మొన్నటివరకు అడవి రాముడు అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఈ సినిమాకు అరణ్య అనే పేరును ఫిక్స్ చేసినట్టు ప్రకటించాడు రానా.

Tags:    
Advertisement

Similar News