'వినయ విధేయ రామ' ఫ్లాపు పై పరుచూరి కామెంట్స్

‘రంగస్థలం’ సినిమాతో భారీ హిట్ ను అందుకున్న రామ్ చరణ్, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి ఒక అద్భుతమైన యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను మెప్పిస్తాడు అనుకుంటే ‘వినయ విధేయ రామ’ సినిమాతో ఫ్యాన్స్ ను నిరాశపరిచారు. రామ్ చరణ్ కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచిన సినిమా లలో ఒకటిగా నిలిచిన ‘వినయ విధేయ రామ’ సినిమా పైన పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. […]

Advertisement
Update:2019-03-17 02:33 IST

‘రంగస్థలం’ సినిమాతో భారీ హిట్ ను అందుకున్న రామ్ చరణ్, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి ఒక అద్భుతమైన యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను మెప్పిస్తాడు అనుకుంటే ‘వినయ విధేయ రామ’ సినిమాతో ఫ్యాన్స్ ను నిరాశపరిచారు.

రామ్ చరణ్ కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచిన సినిమా లలో ఒకటిగా నిలిచిన ‘వినయ విధేయ రామ’ సినిమా పైన పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ సినిమా లాగా ఈ సినిమా కథ కూడా సాగుతుందని, ఆ సినిమాలో చిరంజీవి పేరు కొణిదల రాజారామ్ అయితే ఇందులో రామ్ చరణ్ పేరు రామ్ కొణిదెల అని చెప్పారు. నలుగురు అనాధలను చేరదీయడం వంటి కాన్సెప్ట్ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే గందరగోళంగా ఉండటం వల్ల సినిమా బాలేదని అన్నారు.

సెకండ్ హాఫ్ లో యాక్షన్ సన్నివేశాలు కొంచెం ఓవర్ గా ఉన్నాయని, సినిమా బీహార్ మరియు వైజాగ్ లో జరిగిందని చెప్పిన పరుచూరి సెంటిమెంట్ సస్పెన్స్ రెండిటినీ బ్యాలన్స్ చేసి ఉంటే సినిమా బాగుండేదని పేర్కొన్నారు.

బోయపాటి మంచి దర్శకుడే అయినప్పటికీ ఆయన చేసిన చిన్న చిన్న పొరపాట్లు సినిమా పైన భారీ ప్రభావాన్ని చూపాయని చెప్పుకొచ్చారు పరుచూరి.

Tags:    
Advertisement

Similar News