అభ్యర్థుల ప్రకటన తర్వాత.... "దేశా"నికి మిగిలేవి నలభైనట

తెలుగుదేశం పార్టీ ధీమా పటాపంచలు అవుతోంది. నాలుగు నెలలుగా ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం ఇస్తున్న సర్వేలతో గందరగోళంగా ఉన్న చంద్రబాబు నాయుడు అభ్యర్ధుల ప్రకటన తర్వాత వస్తున్న సర్వేలు కూడా వ్యతిరేకంగా ఉండడం చంద్రబాబు నాయుడిని కలవరానికి గురిచేస్తున్నాయని అంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 126 మంది తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా కొత్తగా మరో సర్వే నిర్వహించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా నిర్వహించిన  సర్వే ప్రకారం […]

Advertisement
Update:2019-03-16 05:28 IST

తెలుగుదేశం పార్టీ ధీమా పటాపంచలు అవుతోంది. నాలుగు నెలలుగా ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం ఇస్తున్న సర్వేలతో గందరగోళంగా ఉన్న చంద్రబాబు నాయుడు అభ్యర్ధుల ప్రకటన తర్వాత వస్తున్న సర్వేలు కూడా వ్యతిరేకంగా ఉండడం చంద్రబాబు నాయుడిని కలవరానికి గురిచేస్తున్నాయని అంటున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 126 మంది తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా కొత్తగా మరో సర్వే నిర్వహించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా నిర్వహించిన సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీకి నలభైకి మించి స్ధానాలు దక్కవని నివేదిక వెల్లడించినట్లు చెబుతున్నారు.

ఈ అభ్యర్థుల జాబితాలో కొత్తవారికి, ముఖ్యంగా యువకులకు ప్రాధాన్యత కల్పించినట్లు చంద్రబాబు నాయుడు చెబుతున్నా… టికెట్లు పొందిన వారంతా గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉన్న వారి వారసులు అని, అప్పుడు తండ్రి అవినీతికి పాల్పడితే ఇప్పుడు వారి పిల్లలు అవినీతిలో ముందుంటారని ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు సర్వేలో తేలింది.

తెలుగుదేశం అభ్యర్థుల్లో పదిమంది వారసులకు చంద్రబాబునాయుడు టికెట్ ఇచ్చారు. వీరిలో కనీసం ఏడుగురు అభ్యర్థులు ఓడిపోతారని, ఆ జాబితాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కూడా ఉన్నారని సర్వే ఫలితాలు వెల్లడైనట్లు చెబుతున్నారు.

అభ్యర్థుల ఎంపికపై తీసుకున్న జాగ్రత్తలు పైకి చెబుతున్నదే కానీ లోలోపల కులాభిమానం, బంధుప్రీతి ఎక్కువగా చూపించారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడినట్లు సమాచారం.

కొత్తగా చేయించిన సర్వే కూడా తనకు వ్యతిరేకంగా రావడంతో చంద్రబాబు నాయుడు డీలా పడ్డారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితాలు ఎలా వస్తాయోననే ఆందోళన చంద్రబాబు నాయుడిలో రోజురోజుకు తీవ్రం అవుతోందని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News