అందుకే మహేష్ ని కాదన్న జక్కన్న

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు అందరూ తమ హీరో ఎప్పుడు రాజమౌళి తో సినిమా చేస్తాడా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి ఒక పక్క, మహేష్ ఒక పక్క సినిమా చెయ్యడానికి సిద్ధమే అనే ప్రకటనలు కూడా ఇచ్చారు. గతంలో ఒకసారి ఇద్దరూ కలిసి పని చేసే తరుణం వచ్చినా ఎందుకో అది వర్క్ అవుట్ అవ్వలేదు. ఇప్పుడు జక్కన్న ప్రస్తుతం రాం చరణ్, తారక్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గురించి […]

Advertisement
Update:2019-03-14 09:44 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు అందరూ తమ హీరో ఎప్పుడు రాజమౌళి తో సినిమా చేస్తాడా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి ఒక పక్క, మహేష్ ఒక పక్క సినిమా చెయ్యడానికి సిద్ధమే అనే ప్రకటనలు కూడా ఇచ్చారు. గతంలో ఒకసారి ఇద్దరూ కలిసి పని చేసే తరుణం వచ్చినా ఎందుకో అది వర్క్ అవుట్ అవ్వలేదు.

ఇప్పుడు జక్కన్న ప్రస్తుతం రాం చరణ్, తారక్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గురించి మీడియా తో మాట్లాడుతూ రాం చరణ్ పాత్ర అల్లూరి సీతా రామ రాజు కి దగ్గర గా ఉంటుంది అని చెప్పాడు.

అయితే ఈ విషయమై మీడియా వాళ్ళు ప్రశ్నిస్తూ, కృష్ణ అల్లూరి సీతా రామ రాజు లాగా చేశారు కనుక, ఈ సినిమాలో మహేష్ ని పెట్టి ఉంటే అభిమానులు ఆనందించేవారు కదా అని అడిగారు. దీంతో రాజమౌళి తడుముకోకుండా సరైన సమాధానం చెప్పాడు.

“ఇంతకు ముందు ఒక ఫంక్షన్ లో మహేష్ బాబు ఫాన్స్ ని కలిసినప్పుడు, వాళ్ళని ఆల్రెడీ నేను అడిగాను. మహేష్ ని సీతా రామరాజు లా చూడాలి అనుకుంటున్నారా? లేకపోతే జేమ్స్ బాండ్ లాగా నా? అని అడిగినప్పుడు…. సీత రామ రాజు అన్నప్పుడు పెద్ద రెస్పాన్స్ ఇవ్వలేదు, అందుకే నేను మహేష్ ని తీసుకోలేదు” అని ఆయన సమాధానం ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News