మెగా అన్నలూ ప్రచారం చేస్తారా.... అబ్బే దూరం నుంచి చూస్తారా...!

వెండితెర మీద అది మెగా కుటుంబం. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అపారమైన అభిమానులను, అనుచరగణాన్ని పెంచుకున్న మెగా ఫ్యామిలీ. వెండితెరపై ఈ కుటుంబం చేసే నటనకు ముగ్ధులైన వారు…. నిజ జీవితంలో మాత్రం ఎందుకో ఆ కుటుంబాన్ని అక్కున చేర్చుకోలేక పోయారు. ఇదంతా ఎవరో… ఎవరి గురించో అర్థమయ్యే ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి కుటుంబం గురించే. వెండి తెర మీద తన నటనను చూసి ఆరాధించిన వారంతా ఎన్నికల కురుక్షేత్రంలో తన వెనుక ఉంటారని మెగాస్టార్ […]

Advertisement
Update:2019-03-12 16:26 IST

వెండితెర మీద అది మెగా కుటుంబం. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అపారమైన అభిమానులను, అనుచరగణాన్ని పెంచుకున్న మెగా ఫ్యామిలీ. వెండితెరపై ఈ కుటుంబం చేసే నటనకు ముగ్ధులైన వారు…. నిజ జీవితంలో మాత్రం ఎందుకో ఆ కుటుంబాన్ని అక్కున చేర్చుకోలేక పోయారు.

ఇదంతా ఎవరో… ఎవరి గురించో అర్థమయ్యే ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి కుటుంబం గురించే. వెండి తెర మీద తన నటనను చూసి ఆరాధించిన వారంతా ఎన్నికల కురుక్షేత్రంలో తన వెనుక ఉంటారని మెగాస్టార్ చిరంజీవి భావించారు. అభిమానుల మీద కొండంత నమ్మకంతో ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించారు. ఆ పార్టీ తొలి ఎన్నికల్లోనే ఘోర పరాజయం పాలైంది.

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇదంతా గతం. ఇక ప్రస్తుతానికి చూస్తే మెగా వారసుడిగా చిత్రరంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో మరో కొత్త పార్టీని ప్రారంభించారు. గడచిన ఐదు సంవత్సరాలుగా తలమునకలైన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.

అన్న లాగే ఆయన కూడా అభిమానులు తన వెంట వస్తే తనకు విజయాన్ని తెచ్చిపెడుతుందని విశ్వాసంగా ఉన్నారు. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో జనసేన పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు రావాల్సిందిగా మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు లతోపాటు వారి కుమారులను, సోదరి కుమారులను, అన్న బావమరిది కుమారుడు అల్లు అర్జున్ ను ప్రచారం కోసం ఆహ్వానించినట్లు సమాచారం.

కీలక నియోజక వర్గాలలో మెగా కుటుంబం నుంచి ఎవరో ఒకరు వచ్చి ప్రచారం చేస్తే తనకు లాభిస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొండంత ఆశలు పెట్టుకున్నారని సమాచారం. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం ప్రచారానికి నో అన్నారని, తన తమ్ముడు నాగబాబు తో సహా కుటుంబంలోని ఇతరులను పంపించడానికి ఓకే చెప్పారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

మెగా కుటుంబంలో అందరూ కాకపోయినా ఒకరిద్దరైనా వచ్చి ప్రచారం చేస్తే తనకు మేలు జరుగుతుందని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారు.

అయితే మెగా కుటుంబం మాత్రం ప్రచారం చేయమని…. దూరం నుంచి అన్నీ గమనిస్తూ సలహాలు ఇస్తామని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. తమ్ముడు తమ్ముడే…. రాజకీయం రాజకీయమే అని మెగా కుటుంబం కొత్త నిర్వచనం చెబుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News