టీఆర్ఎస్‌లోకి ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ

కీలకమైన లోక్‌సభ, ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన రేగా కాంతారావు టీఆర్ఎస్ బాట పట్టగా.. అదే జిల్లాకు చెందిన ఇల్లెందు కాంగ్రెస్ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు సమాచారం. పార్టీ మారే ముందే కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయాలనే ఆలోచనలో హరిప్రియ ఉన్నట్లు సమాచారం. రాజీనామా ఆమోదిస్తే టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తానని ఆమె సన్నిహితులతో చెప్పినట్లు […]

Advertisement
Update:2019-03-10 15:39 IST

కీలకమైన లోక్‌సభ, ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన రేగా కాంతారావు టీఆర్ఎస్ బాట పట్టగా.. అదే జిల్లాకు చెందిన ఇల్లెందు కాంగ్రెస్ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు సమాచారం.

పార్టీ మారే ముందే కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయాలనే ఆలోచనలో హరిప్రియ ఉన్నట్లు సమాచారం. రాజీనామా ఆమోదిస్తే టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తానని ఆమె సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన హరిప్రియ పార్టీ మారడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే. గత ఎన్నికల సమయంలో పట్టుబట్టి మరీ హరిప్రియకు రేవంత్ టికెట్ ఇప్పించారు. ఆమెను ఎలాగైనా గెలిపిస్తానని మాట ఇచ్చి ఇల్లెందు నియోజకవర్గంలో రేవంత్ ప్రచారం కూడా చేశారు. తీరా గెలిచాక హరిప్రియ పార్టీ మారడం కాంగ్రెస్ శ్రేణులకు మింగుడుపడటం లేదు.

కాగా, ఇల్లెందు నియోజకవర్గంలో గత రెండు పర్యాయాలుగా కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తూ వస్తోంది. అయితే గత పర్యాయం గెలిచిన కోరం కనకయ్య ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. తాజాగా కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన హరిప్రియ కూడా టీఆర్ఎస్ గూటికి చేరడం గమనార్హం.

Tags:    
Advertisement

Similar News