జగన్‌ను కలిసిన శివకుమార్

వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన శివకుమార్ వైఎస్ జగన్‌ను కలిశారు. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని రిజిస్ట్రేషన్‌ చేసిన శివకుమార్‌ను…. జగన్‌ తెలంగాణ పార్టీ జనరల్ సెక్రెటరీగా నియమించారు. అయితే ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శివకుమార్… పార్టీ లెటర్‌ హెడ్‌తో బహిరంగ లేఖ విడుదల చేశారు. తెలంగాణలోని వైఎస్‌ అభిమానులంతా కాంగ్రెస్‌- టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. దీంతో ఆగ్రహించిన వైసీపీ నాయకత్వం ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. తనను బహిష్కరించడంపై విమర్శలు, ఆందోళన […]

Advertisement
Update:2019-03-07 12:40 IST

వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన శివకుమార్ వైఎస్ జగన్‌ను కలిశారు. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని రిజిస్ట్రేషన్‌ చేసిన శివకుమార్‌ను…. జగన్‌ తెలంగాణ పార్టీ జనరల్ సెక్రెటరీగా నియమించారు.

అయితే ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శివకుమార్… పార్టీ లెటర్‌ హెడ్‌తో బహిరంగ లేఖ విడుదల చేశారు. తెలంగాణలోని వైఎస్‌ అభిమానులంతా కాంగ్రెస్‌- టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. దీంతో ఆగ్రహించిన వైసీపీ నాయకత్వం ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది.

తనను బహిష్కరించడంపై విమర్శలు, ఆందోళన చేస్తున్న శివకుమార్‌…. లోటస్ పాండ్‌లో జగన్‌ను కలిశారు. జగన్‌ను కలిసిన తర్వాత మాట్లాడిన శివకుమార్… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ లైన్ కు విరుద్దంగా తాను వ్యవహరించడం వల్లే పార్టీ బహిష్కరించిందన్నారు.

పెద్దమనసు చేసుకుని జగన్‌ తిరిగి తనను ఆహ్వానించారని… అందుకు కృతజ్ఞత తెలిపేందుకు వచ్చానన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వస్తుందన్నారు. ప్రధానిగా ఎవరుండాలన్నది వైసీపీనే నిర్ణయిస్తుందని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News