'సైరా' కోసం చరణ్ చెప్పే రేట్ విని భయపడుతున్న బయ్యర్లు.!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్‌పై రూపుదిద్దుకుంటున్న సినిమా “సైరా నరసింహ రెడ్డి”. మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాని అక్టోబర్‌లో రిలీజ్ చేయాలి అని రామ్ చరణ్ భావిస్తున్నాడు. ఈ మేరకు రామ్ చరణ్ ఓవర్సీస్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసాడు అని తెలిసింది. అయితే రామ్ చరణ్ చెప్పే రేట్ విని […]

Advertisement
Update:2019-03-05 10:13 IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్‌పై రూపుదిద్దుకుంటున్న సినిమా “సైరా నరసింహ రెడ్డి”. మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాని అక్టోబర్‌లో రిలీజ్ చేయాలి అని రామ్ చరణ్ భావిస్తున్నాడు. ఈ మేరకు రామ్ చరణ్ ఓవర్సీస్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసాడు అని తెలిసింది.

అయితే రామ్ చరణ్ చెప్పే రేట్ విని ఓవర్సీస్స్ డిస్ట్రిబ్యూటర్స్ చాలా భయపడుతున్నారు అంటా..! ఎందుకంటే రామ్ చరణ్ ఈ సినిమా కోసం అక్కడి డిస్ట్రిబ్యూటర్స్‌ని దాదాపు 4 మిలియన్ డాలర్స్ అడుగుతున్నాడు. బయ్యర్లు మాత్రం అంత పెద్ద మొత్తం పెడితే రిస్కులో పడతామని బేరాలాడుతున్నారట.

మెగాస్టార్ నటించిన “ఖైదీ నెం. 150” సినిమా ఓవర్సీస్స్ బాక్సాఫీసు వద్ద 2.4 మిలియన్ గ్రాస్ వసూలు చేసింది. క్రేజీ కాంబినేషన్ నేపథ్యంలో ప్రస్తుతం అంత కంటే ఎక్కువే వసూలయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రాజెక్టులో రిస్క్ ఫ్యాక్టర్ కూడా చూసుకొని 4 మిలియన్ డాలర్స్ పెట్టి ఈ సినిమాని కొనలేమని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. మరి రామ్ చరణ్ నాలుగు మిలియన్స్ మీదే ఉంటాలో లేదా బయ్యర్ల ఒత్తిడికి తలొగ్గుతాడో వేచి చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News