ఒక్కరికి కూడా "విశ్వాసం" లేదు
తమిళ్ లో అజిత్ చాలా పెద్ద స్టార్. క్రేజ్ పరంగా రజనీకాంత్ తర్వాత స్థానం అతడిదే అంటారు. రీసెంట్ గా అతడు చేసిన విశ్వాసం సినిమా కోలీవుడ్ అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. నిన్నటితో ఆ సినిమా తమిళనాట 50 రోజులు కూడా పూర్తిచేసుకుంది. అంత పెద్ద స్టార్ పై తెలుగు ఆడియన్స్ కు మాత్రం నమ్మకం లేదు. అతడు నటించిన అదే విశ్వాసం సినిమా తెలుగులో డిజాస్టర్ అయింది. మొన్న విడుదలైన ఈ […]
తమిళ్ లో అజిత్ చాలా పెద్ద స్టార్. క్రేజ్ పరంగా రజనీకాంత్ తర్వాత స్థానం అతడిదే అంటారు. రీసెంట్ గా అతడు చేసిన విశ్వాసం సినిమా కోలీవుడ్ అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. నిన్నటితో ఆ సినిమా తమిళనాట 50 రోజులు కూడా పూర్తిచేసుకుంది.
అంత పెద్ద స్టార్ పై తెలుగు ఆడియన్స్ కు మాత్రం నమ్మకం లేదు. అతడు నటించిన అదే విశ్వాసం సినిమా తెలుగులో డిజాస్టర్ అయింది. మొన్న విడుదలైన ఈ సినిమాకు 2 రోజుల్లో కేవలం 55 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి.
అజిత్ కు తెలుగులో మార్కెట్ లేదు. దాదాపు దశాబ్ద కాలంలో అతడి సినిమా తెలుగులో ఆడిన చరిత్ర లేదు. అందుకే విశ్వాసం సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా చాలా తక్కువగా జరిగింది. అయినప్పటికీ ఆమాత్రం వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది విశ్వాసం. మొదటి రోజే ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో, నిన్నట్నుంచి థియేటర్లలో విశ్వాసం చూసేవాళ్లు కరువయ్యారు.
నిజానికి అజిత్ కూడా ఎప్పుడూ టాలీవుడ్ పై ఫోకస్ పెట్టలేదు. సూర్య, కార్తి, విక్రమ్, రజనీకాంత్ లా తను కూడా టాలీవుడ్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేసినట్టయితే అతడికి కూడా కాస్తోకూస్తో మార్కెట్ పెరిగేది. కనీసం తన సినిమా ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చినా బాగుండేది.
కానీ అజిత్ కు టాలీవుడ్ మార్కెట్ అక్కర్లేదు. కోలీవుడ్ ను శాసించే స్థాయిలో ఉన్న అజిత్, టాలీవుడ్ ను పూర్తిగా లైట్ తీసుకున్నాడు. అందుకే తెలుగు ప్రేక్షకులు కూడా అజిత్ ను పూర్తిగా లైట్ తీసుకున్నారు.