కథ విషయంలో డైరెక్టర్ ని ఇబ్బంది పెడుతున్న రవితేజ

రవితేజ కి “రాజా ది గ్రేట్” లాంటి హిట్ తరువాత ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. “టచ్ చేసి చూడు” “నెల టిక్కెట్” “అమర్ అక్బర్ అంటోనీ” సినిమాలతో రవితేజ భారీ డిసాస్టర్స్ ని అందుకున్నాడు. ఈ సినిమాల తరువాత రవితేజ “ఒక్క క్షణం” ఫేం వి.ఐ ఆనంద్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఇక వి.ఐ ఆనంద్ కూడా రవితేజ కోసం ఒక అదిరిపోయే కథ రెడీ చేసుకున్నాడు. “డిస్కో రాజా” […]

Advertisement
Update:2019-03-01 06:09 IST
కథ విషయంలో డైరెక్టర్ ని ఇబ్బంది పెడుతున్న రవితేజ
  • whatsapp icon

రవితేజ కి “రాజా ది గ్రేట్” లాంటి హిట్ తరువాత ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. “టచ్ చేసి చూడు” “నెల టిక్కెట్” “అమర్ అక్బర్ అంటోనీ” సినిమాలతో రవితేజ భారీ డిసాస్టర్స్ ని అందుకున్నాడు. ఈ సినిమాల తరువాత రవితేజ “ఒక్క క్షణం” ఫేం వి.ఐ ఆనంద్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఇక వి.ఐ ఆనంద్ కూడా రవితేజ కోసం ఒక అదిరిపోయే కథ రెడీ చేసుకున్నాడు.

“డిస్కో రాజా” అని టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కథ విషయం లో రవితేజ ఇంకా సంతృప్తికరంగా లేడని టాక్ వినిపిస్తోంది.

కారణం ఈ సినిమా కథ సమంతా హీరోయిన్ గా నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్న “ఓ బేబీ ఎంత సక్కగున్నావే” సినిమా కథకి చాలా దగ్గరగా ఉందట. అందుకే రవితేజ వి.ఐ ఆనంద్ ని కథలో మార్పులు చేయమని కోరుతున్నాడట. రామ్ తాళ్లూరి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో నాబా నటాష్, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News