"118" సినిమా రివ్యూ

రివ్యూ:  118 రేటింగ్‌:  2/5 తారాగణం: నందమూరి కళ్యాణ్ రామ్, షాలిని పాండే,  నివేదా థామస్ తదితరులు సంగీతం:  శేఖర్ చంద్ర నిర్మాత:  మహేష్ ఎస్ కోనేరు దర్శకత్వం:  కెవి గుహన్ గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక స్ట్రగుల్ అవుతున్న నందమూరి కళ్యాణ్ రామ్ బోలెడు ఆశలు పెట్టుకుని చేసిన సినిమా 118. టైటిల్ తోనే ఇది సస్పెన్స్ మూవీ అని చెప్పేసిన టీమ్…. ట్రైలర్ లో పూర్తి క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు సహా ప్రేక్షకులు ఎలాంటి అంచనాలు పెట్టుకోవాలో […]

Advertisement
Update:2019-03-01 11:37 IST

రివ్యూ: 118
రేటింగ్‌: 2/5
తారాగణం: నందమూరి కళ్యాణ్ రామ్, షాలిని పాండే, నివేదా థామస్ తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
నిర్మాత: మహేష్ ఎస్ కోనేరు
దర్శకత్వం: కెవి గుహన్

గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక స్ట్రగుల్ అవుతున్న నందమూరి కళ్యాణ్ రామ్ బోలెడు ఆశలు పెట్టుకుని చేసిన సినిమా 118. టైటిల్ తోనే ఇది సస్పెన్స్ మూవీ అని చెప్పేసిన టీమ్…. ట్రైలర్ లో పూర్తి క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు సహా ప్రేక్షకులు ఎలాంటి అంచనాలు పెట్టుకోవాలో ముందే ప్రిపేర్ అయ్యారు. కెవి గుహన్ తెలుగులో మొదటిసారి దర్శకత్వం వహించిన ఈ మూవీలో హీరోయిన్లుగా షాలిని పాండే, నివేద థామస్ చేయడం మరో ఆకర్షణగా నిలిచింది.

టీవీ రిపోర్టర్ గౌతమ్(కళ్యాణ్ రామ్)కు ఓ విచిత్రమైన కల వస్తుంటుంది. అందులో ఆధ్యా(నివేదా థామస్)హత్యకు గురైనట్టు కనిపిస్తుంది. కాని ఈ ఆధ్యా ఎవరో గౌతంకు తెలియదు. ఈ రహస్యాన్ని కనిపెట్టడానికి ఫ్రెండ్(ప్రభాస్ శీను), కాబోయే భార్య మేఘ(షాలిని పాండే)తో కలిసి ప్రైవేటు ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. అయితే దీని వెనుక పెద్ద మెడికల్ మాఫియా కుట్ర ఉందని తెలుస్తుంది. అంతే కాదు గౌతంకు ఆధ్యాకు మర్డర్ కు సంబంధించిన లింక్ ఉంటుంది. అదేంటి అనేదే 118.

కళ్యాణ్ రామ్ ఇలాంటి పాత్ర గతంలో చేయలేదు కాని మంచి ఈజ్ తో మెప్పించాడు. నటన పరంగా మైనస్ అని చెప్పడానికి ఏమి లేదు. నివేదా థామస్ కేవలం సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ ముందు నుంచి మాత్రమే ఉంటుంది. కథలో కీలకమైన పాత్ర కాబట్టి తననుంచి ఎమోషనల్ డ్రామాను రాబట్టుకున్నాడు దర్శకుడు. షాలిని పాండే ఉత్సవ విగ్రహం అయ్యింది. ప్రభాస్ శీను, హరితేజలవి మాత్రం కాస్త చెప్పుకోదగ్గ లెంత్ ఉన్న పాత్రలు. మిగిలినవేవి రిజిస్టర్ కావు. రాజీవ్ కనకాల, సురేఖా వాణి తదితరులు అందరూ రెండు మూడు సీన్లకే పరిమితం.

దర్శకుడు కెవి గుహన్ తీసుకున్న ప్లాట్ బాగుంది. కలలో హత్యను చూసి దాని వెనుక హీరో పడటం అనే పాయింట్ లో కొత్తదనం ఉంది. అయితే వినడానికి బాగున్నా…. ఈ థీమ్ ని తెరపైకి తెరకెక్కించడానికి గుహన్ తడబడటంతో ఫైనల్ గా మంచి థ్రిల్లర్ అనిపించుకోవడంలో 118 ఫెయిల్ అయ్యింది.

ఎంతసేపూ పరిస్థితులన్నీ హీరోకు అనుగుణంగా మారిపోయి అతని వేటకు సహకరిస్తాయే తప్ప ఛాలెంజ్ అనిపించే ఏ ఒక్క ఎపిసోడ్ ని గుహన్ బలంగా రాసుకోలేకపోయాడు. పైగా కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని గతంలో ఎన్నో సినిమాల్లో చూసినట్టు అనిపించడంతో ప్రేక్షకులకు ఫస్ట్ హాఫ్ లో మిగిలిన ధ్రిల్స్…. సెకండ్ హాఫ్ లో డల్ గా మారిపోతాయి.

పైగా క్లైమాక్స్ ను రాసుకున్న తీరును చూసి అసలు ఆలోచించే రాసారా లేక ఏం తీయాలో అర్థం కాని అయోమయంలో ఏదో ఒకటి అని…. కళ్యాణ్ రామ్ ను కృత్రిమంగా కలలోకి పంపించి ముగించేసారా అనే డౌట్ సగటు ప్రేక్షకుడికి కలిగిందంటే అది ముమ్మాటికి స్క్రీన్ ప్లే లోపమే.

ఎక్కడా గ్రిప్పింగ్ గా లేకపోవడంతో 118 కొన్ని సన్నివేశాల్లో మినహాయించి సినిమా మొత్తం ఓ మాములు కంటే తక్కువ స్థాయి థ్రిల్లర్ అనిపిస్తుంది. శేఖర్ చంద్ర సంగీతం కూడా సోసోనే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏదో హోరేత్తినట్టు ఉంది. ఇలాంటి అవకాశాన్ని అతను సరిగా వాడుకోలేదు. గుహన్ దర్శకత్వం కంటే కెమెరా పనితనం బాగుంది. మిర్చి బాబ్జీ సంభాషణలు చప్పగా ఉన్నాయి. నిర్మాణంలో కూడా చాలా రాజీ పడ్డారు.

ఇక ఫైనల్ గా చెప్పాలంటే 118 ఒక రొటీన్ క్రైమ్ థ్రిల్లర్. లైన్ లో కొత్తదనం ఉన్నా చెప్పే విధానం రొటీన్ గా ఉండటంతో ఫైనల్ గా ఇది ఏ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకోలేక యావరేజ్ ప్రొడక్ట్ గా మిగిలిపోయింది.

థ్రిల్లర్స్ అంటే విపరీతమైన మోజు ఉన్న వాళ్ళకు సైతం కష్టం అనిపించే 118ని…. సెకండ్ హాఫ్ ని పూర్తిగా చూసి భరించడం కష్టమే. కళ్యాణ్ రామ్ గత డిజాస్టర్లతో పోలిస్తే కొంత నయం అనిపించవచ్చేమో కాని ఆ కోణం వదిలేసి చూస్తే సక్సెస్ కోసం కళ్యాణ్ రామ్ 118 మీద పెట్టుకున్న ఆశలు నెరవేరడం కష్టమే.

118 – కన్ఫ్యుజింగ్ క్రైమ్

Advertisement

Similar News