ఏపీ ప్రభుత్వంపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్
ఏపీ ప్రభుత్వంపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ అయింది. దళితుల పట్ల టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచితమైన పదాలతో దూషించినా చర్యలు తీసుకోకపోవడంపై కమిషన్ మండిపడింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. చింతమనేని చేసిన వ్యాఖ్యలపై ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని స్పష్టం చేసింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం అన్ని వివరాలను ఇవ్వాలని ఆదేశించింది. 15 రోజుల్లోగా […]
ఏపీ ప్రభుత్వంపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ అయింది. దళితుల పట్ల టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచితమైన పదాలతో దూషించినా చర్యలు తీసుకోకపోవడంపై కమిషన్ మండిపడింది.
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. చింతమనేని చేసిన వ్యాఖ్యలపై ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని స్పష్టం చేసింది.
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం అన్ని వివరాలను ఇవ్వాలని ఆదేశించింది. 15 రోజుల్లోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు సమాధానం చెప్పని పక్షంలో కోర్టుకు హాజరయ్యేలా సమన్లు జారీ చేస్తామని ఎస్సీ కమిషన్ హెచ్చరించింది.