చివరి దశ లో ఉన్న "సై రా నరసింహరెడ్డి"....

“సై రా నరసింహారెడ్డి” మెగా స్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన సినిమా గా రూపొందుతుంది. గత ఏడాది షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు చివరి దశలో ఉందట. ఇటీవలే బీదర్ లో షూటింగ్ ఇబ్బందులు ఎదుర్కున్న మూవీ యూనిట్ ప్రస్తుతం ఆ షూటింగ్ ని మార్చి మొదటి వారానికి పోస్ట్ పోన్ చేసారు. మార్చి చివరి వారం లోగా సినిమా షూటింగ్ మొత్తం అయిపోతుందట. ప్రస్తుతానికి ఒక నాలుగు రోజులు మాత్రమే […]

Advertisement
Update:2019-02-27 07:08 IST

“సై రా నరసింహారెడ్డి” మెగా స్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన సినిమా గా రూపొందుతుంది. గత ఏడాది షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు చివరి దశలో ఉందట.

ఇటీవలే బీదర్ లో షూటింగ్ ఇబ్బందులు ఎదుర్కున్న మూవీ యూనిట్ ప్రస్తుతం ఆ షూటింగ్ ని మార్చి మొదటి వారానికి పోస్ట్ పోన్ చేసారు. మార్చి చివరి వారం లోగా సినిమా షూటింగ్ మొత్తం అయిపోతుందట. ప్రస్తుతానికి ఒక నాలుగు రోజులు మాత్రమే టాకీ పార్ట్ బ్యాలెన్స్ ఉందని మూవీ యూనిట్ సభ్యులు అంటున్నారు.

ఇక షూటింగ్ కి సంబంధించిన అన్ని పనులు పూర్తి అవ్వగానే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిపోతారు మూవీ టీం. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార, తమన్నా లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో చిరంజీవి గురువు పాత్రలో నటిస్తుండటం విశేషం. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ లేదా అక్టోబర్ లో గాని థియేటర్స్ లో సందడి చేయబోతుంది.

Tags:    
Advertisement

Similar News