టైటిల్ వార్‌.... మెగా టార్గెట్‌

గ్యాంగ్ లీడర్.. ఈ సినిమా పేరైతే ఆర్భాటంగా ప్రకటించాడు కానీ ఆ తర్వాత వచ్చిన పరిణామాల్ని ఊహించలేకపోయాడు నాని. టైటిల్ ప్రకటించడమే ఆలస్యం, మెగా ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. చిరంజీవి కెరీర్ లోనే కల్ట్ క్లాసిక్ గా నిలిచిన గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ను ఎలా వాడుతారంటూ నానిని నిలదీస్తున్నారు నెటిజన్లు. గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ను వాడడానికి స్వయానా చిరంజీవి తనయుడు రామ్ చరణ్ వెనకాడిన విషయం తెలిసిందే. కొన్నింటిని […]

Advertisement
Update:2019-02-26 14:26 IST

గ్యాంగ్ లీడర్.. ఈ సినిమా పేరైతే ఆర్భాటంగా ప్రకటించాడు కానీ ఆ తర్వాత వచ్చిన పరిణామాల్ని ఊహించలేకపోయాడు నాని. టైటిల్ ప్రకటించడమే ఆలస్యం, మెగా ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. చిరంజీవి కెరీర్ లోనే కల్ట్ క్లాసిక్ గా నిలిచిన గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ను ఎలా వాడుతారంటూ నానిని నిలదీస్తున్నారు నెటిజన్లు.

గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ను వాడడానికి స్వయానా చిరంజీవి తనయుడు రామ్ చరణ్ వెనకాడిన విషయం తెలిసిందే. కొన్నింటిని అలానే ఉంచాలని, కెలక్కూడదని చరణ్ గతంలో అన్నాడు. ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ ఈ టైటిల్ ను వాడే పరిస్థితి వస్తే, అంతా వ్యతిరేకించారు. ఇలా మెగా హీరోలే ఈ టైటిల్ ను టచ్ చేయడానికి వెనకాముందు అవుతుంటే, నాని ఏకంగా టైటిల్ ను ప్రకటించడంతో మెగాభిమానులు కోపంగా ఉన్నారు.

నిజానికి విక్రమ్ కుమార్, ఈ టైటిల్ తో పాటు సినిమా స్టోరీని బన్నీకి ముందుగా చెప్పాడట. బన్నీ రిజెక్ట్ చేయడంతో ఆ కథ నాని వద్దకు వచ్చింది. నాని ఓకే చేయడం, టైటిల్ ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. అయితే ఈ టైటిల్ ను బన్నీ వాడినప్పటికీ ఇలానే వ్యతిరేకిస్తామని, ఇకనైనా నాని తన సినిమాకు గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ పెట్టుకోవడం మానేయాలని మెగా ఫ్యాన్స్ వరుసగా పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో నడుస్తున్న ఈ ఆందోళనపై నాని ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Tags:    
Advertisement

Similar News