నేరుగా వెళ్లి బటన్ నొక్కిన జేసీ దివాకర్ రెడ్డి....

అనంతపురం టీడీపీలో వర్గపోరు ముదిరింది. రాంనగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం విషయంలో చాలా కాలంగా ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మధ్య వార్ నడుస్తోంది. క్రెడిట్ కోసం ఇద్దరూ పోటీ పడుతూ వచ్చారు. అయితే త్వరలో ఎన్నికల కోడ్‌ వచ్చే అవకాశం ఉండడంతో బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యారు. సోమవారం ఉదయం 10గంటలకు బ్రిడ్జ్ ప్రారంభోత్సవం కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం. 9.50కే ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప చేరుకున్నారు. మరో ఐదు నిమిషాలకు జేసీ దివాకర్ రెడ్డి […]

Advertisement
Update:2019-02-26 04:44 IST

అనంతపురం టీడీపీలో వర్గపోరు ముదిరింది. రాంనగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం విషయంలో చాలా కాలంగా ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మధ్య వార్ నడుస్తోంది. క్రెడిట్ కోసం ఇద్దరూ పోటీ పడుతూ వచ్చారు. అయితే త్వరలో ఎన్నికల కోడ్‌ వచ్చే అవకాశం ఉండడంతో బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యారు.

సోమవారం ఉదయం 10గంటలకు బ్రిడ్జ్ ప్రారంభోత్సవం కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం. 9.50కే ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప చేరుకున్నారు. మరో ఐదు నిమిషాలకు జేసీ దివాకర్ రెడ్డి వచ్చారు. అప్పటి
వరకు జాయింట్ కలెక్టర్‌ కోసం ఎమ్మెల్యే, మేయర్ ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంతలో సరిగ్గా పది కావడంతో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నేరుగా శిలాపలకం వద్దకు వెళ్లి దాన్ని ఆవిష్కరించేశారు. అక్కడ ఏర్పాటు చేసిన బటన్‌ నొక్కి బ్రిడ్జిని ప్రారంభించేశారు.

జేసీ బటన్ నొక్కగానే ఆయన అనుచరులు జేసీకి అనుకూలంగా పెద్దెత్తున నినాదాలు చేశారు. దాంతో కాస్త దూరంలో ఉన్న ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి కంగుతిన్నారు. ఏం జరిగిందని ఆరా తీశారు. ఎంపీ బ్రిడ్జ్‌ను ప్రారంభించేశారని అధికారులు వివరించారు. దీంతో ప్రభాకర్‌ చౌదరి తనను అవమానించారంటూ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

తామంతా ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమం జరగాలని ఎదురుచూస్తుంటే ఎంపీ నేరుగా వచ్చి, కనీసం అక్కడే ఉన్న తమను పిలవకుండానే ఎలా బ్రిడ్జ్‌ను ప్రారంభిస్తారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఎంపీ తీరు పట్ల మేయర్ స్వరూప కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ రాకముందే ప్రారంభోత్సవం చేయడం ఏమిటని ప్రశ్నించారామె.

అయితే జేసీ మాత్రం 10 గంటలకు ముహూర్తమని చెప్పారని… ఆ సమయానికి తాము వచ్చామని… జాయింట్ కలెక్టర్ కోసం తాము ఎదురు చూడాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరికి షాక్‌ ఇచ్చేందుకే
జేసీ చాలా తెలివిగా వ్యవహరించి నేరుగా వెళ్లి బటన్‌ నొక్కేశారని భావిస్తున్నారు.

మొత్తం మీద చివరకు ప్రభాకర్‌ చౌదరిని కంగు తినిపిస్తూ జేసీ దివాకర్ రెడ్డి… బ్రిడ్జి ప్రారంభోత్సవం విషయంలో పైచేయి సాధించారన్న భావన వ్యక్తమవుతోంది.

Tags:    
Advertisement

Similar News