మహానాయకుడు మొదటి రోజు వసూళ్లు

బాలకృష్ణ నటించిన మహానాయకుడు సినిమా డిజాస్టర్ గా నిలిచింది. మొదటి రోజు ఈ సినిమాకు దారుణంగా వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కోటి రూపాయలకు అటుఇటుగా వచ్చింది.. చాలా ఏరియాల్లో థియేటర్ల రెంట్ లు, కరెంట్ బిల్లులకు సరిపడా వసూళ్లు కూడా రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు బాలకృష్ణ కెరీర్ లో అతిపెద్ద డిజాస్టర్ పరమవీర చక్ర సినిమా మాత్రమే. ఆ రికార్డును మహానాయకుడు కొట్టేసింది. మరోవైపు స్టార్ హీరోలు నటించిన బడా […]

Advertisement
Update:2019-02-23 08:50 IST

బాలకృష్ణ నటించిన మహానాయకుడు సినిమా డిజాస్టర్ గా నిలిచింది. మొదటి రోజు ఈ సినిమాకు దారుణంగా వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కోటి రూపాయలకు అటుఇటుగా వచ్చింది.. చాలా ఏరియాల్లో థియేటర్ల రెంట్ లు, కరెంట్ బిల్లులకు సరిపడా వసూళ్లు కూడా రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు బాలకృష్ణ కెరీర్ లో అతిపెద్ద డిజాస్టర్ పరమవీర చక్ర సినిమా మాత్రమే. ఆ రికార్డును మహానాయకుడు కొట్టేసింది.

మరోవైపు స్టార్ హీరోలు నటించిన బడా సినిమాల్లో అత్యంత డిజాస్టర్ గా ఇప్పటివరకు ఆఫీసర్ పేరిట రికార్డు ఉంది. ఇప్పుడా రికార్డును కూడా మహానాయకుడు క్రాస్ చేయబోతోంది. టాలీవుడ్ లో అతిపెద్ద డిజాస్టర్ గా ఇది నిలవబోతోంది. ఈరోజు ఈ సినిమాకు ఆక్యుపెన్సీ 40శాతం కూడా లేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సోమవారం నుంచి సగం థియేటర్లలో ఈ సినిమాను లేపేసే ప్రమాదముందని అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 37 లక్షలు
సీడెడ్ – రూ. 10 లక్షలు
ఉత్తరాంధ్ర – రూ. 16 లక్షలు
ఈస్ట్ – రూ. 9 లక్షలు
వెస్ట్ – రూ. 10 లక్షలు
గుంటూరు – రూ. 51 లక్షలు
నెల్లూరు – రూ. 5 లక్షలు
కృష్ణా – రూ. 12 లక్షలు

Tags:    
Advertisement

Similar News