"బాహుబలి" ప్రొడ్యూసర్స్ తో క్రిష్

చిన్న సినిమాలు డైరెక్ట్ చేస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు క్రిష్. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా సక్సెస్ అయ్యాడు ఈ డైరెక్టర్. అయితే బాలీవుడ్ లో లేటెస్ట్ గా డైరెక్ట్ చేసిన “మణికర్ణిక” క్రిష్ ని కెరీర్ పరంగా అనేక ఇబ్బందుల్లోకి నెట్టేసింది. క్రిష్ ఆ సినిమా మధ్యలో నుంచి వచ్చి బాలక్రిష్ణ తో “ఎన్టీఆర్” బయోపిక్ డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాని మొత్తం రెండు పార్ట్స్ […]

Advertisement
Update:2019-02-22 05:06 IST
"బాహుబలి" ప్రొడ్యూసర్స్ తో క్రిష్
  • whatsapp icon

చిన్న సినిమాలు డైరెక్ట్ చేస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు క్రిష్. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా సక్సెస్ అయ్యాడు ఈ డైరెక్టర్. అయితే బాలీవుడ్ లో లేటెస్ట్ గా డైరెక్ట్ చేసిన “మణికర్ణిక” క్రిష్ ని కెరీర్ పరంగా అనేక ఇబ్బందుల్లోకి నెట్టేసింది.

క్రిష్ ఆ సినిమా మధ్యలో నుంచి వచ్చి బాలక్రిష్ణ తో “ఎన్టీఆర్” బయోపిక్ డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాని మొత్తం రెండు పార్ట్స్ గా డైరెక్ట్ చేసిన క్రిష్ మొదటి పార్ట్ అయిన “కథానాయకుడు” తో ఘోరమైన ఫ్లాప్ ని చవి చూసాడు.

ఇక ఇప్పుడు రెండో భాగం అయిన “మహానాయకుడు” కూడా పెద్ద హంగామా లేకుండా విడుదలయింది. ఇలాంటి సమయంలో “బాహుబలి” నిర్మాత అయిన శోభు యార్లగడ్డ క్రిష్ కి ఒక భారీ ఆఫర్ ఇచ్చాడట.

అవును తెలుగు, హిందీ బాషల్లో కలిపి ఒక సినిమా ప్రొడ్యూస్ చేయమని క్రిష్ కి ఆఫర్ ఇచ్చాడట శోభు. క్రిష్ కూడా ప్రస్తుతానికి ఏ సినిమా సైన్ చేయలేదు కాబట్టి శోభు ఆఫర్ కి ఎస్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయం పై క్రిష్ దగ్గర నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News