ఐదు స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు తన గత ధోరణికి భిన్నంగా ముందుగానే అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. అమరావతిలో ఇవాళ రాజంపేట పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాల సమీక్ష నిర్వహించారు. స్థానిక నేతలు, కార్యకర్తల సమక్షంలో సంప్రదింపులు జరుపుతూ.. ఐవీఆర్ఎస్ ద్వారా జరిపిన ప్రజాభిప్రాయాన్ని బేరీజు వేసుకుంటూ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. తొలుత రాజంపేట అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు పేరును ప్రకటించారు. ఈయన అభ్యర్థిత్వంపై కొందరు అలకబూనగా వారిని బుజ్జగించారు. […]

Advertisement
Update:2019-02-21 14:35 IST

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు తన గత ధోరణికి భిన్నంగా ముందుగానే అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. అమరావతిలో ఇవాళ రాజంపేట పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాల సమీక్ష నిర్వహించారు. స్థానిక నేతలు, కార్యకర్తల సమక్షంలో సంప్రదింపులు జరుపుతూ.. ఐవీఆర్ఎస్ ద్వారా జరిపిన ప్రజాభిప్రాయాన్ని బేరీజు వేసుకుంటూ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు.

తొలుత రాజంపేట అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు పేరును ప్రకటించారు. ఈయన అభ్యర్థిత్వంపై కొందరు అలకబూనగా వారిని బుజ్జగించారు. ఇక పీలేరు అభ్యర్థిగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని ప్రకటించారు. రైల్వేకోడూరు టికెట్‌పై భారీ పోటీ నెలకొంది. చివరకు తిరుపతి ఎంపీ శివప్రసాద్ అల్లుడు నరసింహకు ఈ టికెట్ కేటాయించారు.

ఇక రాయచోటి అభ్యర్థిగా రమేష్ కుమార్ రెడ్డిని, పుంగనూరు అభ్యర్థిగా అనూష రెడ్డిని ఎంపిక చేశారు. తంబళ్లపల్లి నియోజకవర్గం అభ్యర్థి ఎంపిక విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ వివరాలు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో పాటు…. నేతలు, కార్యకర్తల మధ్య ఏకాభిప్రాయం రానందుకు ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టారు. మదనపల్లి టికెట్ పొత్తులో ఎవరికైనా కేటాయించే అవకాశం ఉంది. ఇక్కడ గతంలో బీజేపీ పోటీ చేసింది.

Tags:    
Advertisement

Similar News