చెల్లెలి కోరికతో కాంగ్రెస్ నాయకుడి పదవి పీకేసిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తర ప్రదేశ్ తూర్పు విభాగం ఇంచార్జి ప్రియాంకా గాంధీ చేసిన పని ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశం అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లో తనకు ఇచ్చిన టీం సభ్యుని గత చరిత్ర తెలుసుకొని అతడిని తప్పించమని అన్నయ్య, జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ను కోరింది. దీంతో ఆమె కోరికను మన్నించి అతడిని సదరు పోస్టు నుంచి రాహుల్ తప్పించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన కుమార్ ఆశిష్ అనే కాంగ్రెస్ నాయకుడు 2005లో పరీక్ష […]

Advertisement
Update:2019-02-21 07:23 IST

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తర ప్రదేశ్ తూర్పు విభాగం ఇంచార్జి ప్రియాంకా గాంధీ చేసిన పని ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశం అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లో తనకు ఇచ్చిన టీం సభ్యుని గత చరిత్ర తెలుసుకొని అతడిని తప్పించమని అన్నయ్య, జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ను కోరింది. దీంతో ఆమె కోరికను మన్నించి అతడిని సదరు పోస్టు నుంచి రాహుల్ తప్పించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

బీహార్‌కు చెందిన కుమార్ ఆశిష్ అనే కాంగ్రెస్ నాయకుడు 2005లో పరీక్ష పత్రాలు లీక్ చేసిన ఘటనలో నిందితుడు. దీంతో అతడిని బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడే పార్టీ కూడా అతడిని సస్పెండ్ చేసింది. జైలు నుంచి విడుదల అయ్యాక పార్టీలో తిరిగి చేరాడు. అంతే కాక ఆ తర్వాత కాంగ్రెస్ టికెట్‌పై బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయాడు.

ఇటీవల ప్రియాంక గాంధీకి ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగం బాధ్యతలు అప్పగించాక ఆరుగురు కార్యదర్శులతో కలిగిన టీంను కాంగ్రెస్ ఆమెకు కేటాయించింది. ఆ ఆరుగురిలో కుమార్ ఆశిష్ కూడా ఉన్నాడు. అయితే ఆయన గత చరిత్ర తెలుసుకున్న ప్రియాంకా గాంధీ వెంటనే అతడిని టీం నుంచి తప్పించాలని రాహుల్‌ను కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారు.

ఈ చర్య కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అవినీతి ఆరోపణలు, కేసులు ఉన్న వారిని పదవుల నుంచి తప్పించడం పార్టీలో చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ఇప్పుడు రాహుల్, ప్రియాంక వచ్చాక జరుగుతున్న పరిణామాలు చాలా మందిని కలవరపెడుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News