మహానాయకుడు.... ఇది చంద్రబాబు సినిమా

మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్న మహానాయకుడు సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రచార కార్యక్రమాలు లేవు. వెబ్, టీవీ, పేపర్.. ఇలా ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. కేవలం యాడ్స్ తో బండి లాగిస్తున్నారు. ఇక ఆఖరి నిమిషంలో మాత్రం తప్పదన్నట్టు బాలయ్య తెరపైకి వచ్చారు. కల్యాణ్ రామ్ తో కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. 30 నిమిషాల పాటు సాగిన ఆ ఇంటర్వ్యూలో బాలయ్య తేల్చిన విషయం ఏంటంటే.. ఇందులో చంద్రబాబే హీరో. అవును.. మొదటి భాగాన్ని తండ్రి […]

Advertisement
Update:2019-02-21 14:47 IST

మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్న మహానాయకుడు సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రచార కార్యక్రమాలు లేవు. వెబ్, టీవీ, పేపర్.. ఇలా ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. కేవలం యాడ్స్ తో బండి లాగిస్తున్నారు. ఇక ఆఖరి నిమిషంలో మాత్రం తప్పదన్నట్టు బాలయ్య తెరపైకి వచ్చారు. కల్యాణ్ రామ్ తో కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. 30 నిమిషాల పాటు సాగిన ఆ ఇంటర్వ్యూలో బాలయ్య తేల్చిన విషయం ఏంటంటే.. ఇందులో చంద్రబాబే హీరో.

అవును.. మొదటి భాగాన్ని తండ్రి ఎన్టీఆర్ కు అంకితమిచ్చిన బాలయ్య, రెండో పార్ట్ మహానాయకుడు సినిమాను మాత్రం బావ చంద్రబాబుకు అంకితం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.

సినిమాలో చాలా భాగం చంద్రబాబు కనిపిస్తారని స్పష్టంచేసిన బాలయ్య.. మూవీలో ఎన్టీఆర్-చంద్రబాబు మధ్య అనుబంధాన్ని వాళ్ల ఎమోషనల్ కనెక్ట్ ను చక్కగా చూపించాం అంటున్నారు.

నాదెండ్ల సృష్టించిన సంక్షోభం వరకే ఎన్టీఆర్-మహానాయకుడు సినిమాను తీసుకున్నామని స్పష్టంచేసిన బాలయ్య.. రన్ టైమ్ ను కూడా 2 గంటల 8 నిమిషాలకే కుదించినట్టు స్పష్టంచేశారు. కథానాయకుడు సినిమాలో గెటప్స్ ఉన్నాయి కాబట్టి రన్ టైమ్ పెరిగిందని, మహానాయకుడులో కేవలం రాజకీయాలే చూపించాం కాబట్టి 2 గంటలకే సినిమా పూర్తయిందంటున్నారు బాలయ్య.

ఓవరాల్ గా మహానాయకుడు సినిమాలో చంద్రబాబు పాత్ర గొప్పగా ఉంటుందంటున్నారు. చరిత్రలో ఉన్నది, మరుగున పడిన నిజాల్ని మాత్రమే చూపించామని బాలయ్య చెప్పడం కొసమెరుపు.

Tags:    
Advertisement

Similar News