అలాగైతే పార్టీని వీడుతా " ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

తన మూలంగా పార్టీకి చెడ్డ పేరు వస్తుందని భావిస్తే టీడీపీని వీడడానికి సిద్దంగా ఉన్నానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఏలూరులో టీడీపీ – వైసీపీ పార్టీల మధ్య వివాదం ముదిరి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరుపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒక కార్యక్రమంలో ఆయన దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంతో జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన ఇవాళ వివరణ ఇచ్చారు. […]

Advertisement
Update:2019-02-20 15:03 IST

తన మూలంగా పార్టీకి చెడ్డ పేరు వస్తుందని భావిస్తే టీడీపీని వీడడానికి సిద్దంగా ఉన్నానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఏలూరులో టీడీపీ – వైసీపీ పార్టీల మధ్య వివాదం ముదిరి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరుపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

ఒక కార్యక్రమంలో ఆయన దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంతో జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన ఇవాళ వివరణ ఇచ్చారు. తాను మాట్లాడిన కొంత భాగాన్ని మాత్రమే సోషల్‌మీడియాలో పోస్టు చేసి తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.

తనను దళిత వ్యతిరేకిగా ముద్రవేస్తున్నారని.. త్వరలోనే పార్టీ శ్రేణులు, అభిమానులతో సమావేశమవుతానన్నారు. అప్పుడే పార్టీ వీడే నిర్ణయాన్ని వెల్లడిస్తానని చింతమనేని స్పష్టం చేశారు.

కాగా, చింతమనేని వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలి సారి కాదు. గతంలో ఎమ్మార్వో వనజాక్షి మీద జులుం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Tags:    
Advertisement

Similar News