కశ్మీర్ వెళ్లొద్దు.... కశ్మీరీల వస్తువులు కొనొద్దు.... గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

ఆయన ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి. ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. పుల్వామా దాడి తర్వాత దేశమంతా కశ్మీరీలకు అండగా ఉంటే…. ఆ గవర్నర్ మాత్రం కశ్మీరీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే.. మేఘాలయ గవర్నర్ తథాగత రాయ్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. దాంట్లో ఏం రాశారంటే.. ఇండియన్ ఆర్మీ రిటైర్డ్ కల్నల్ ఒకరు ఈ అప్పీలు చేశారు. కశ్మీర్‌లో పర్యటించొద్దు. వచ్చే రెండేళ్లలో అమర్‌నాథ్ యాత్రకు కూడా వెళ్లొద్దు. కశ్మీరీలు అమ్మే […]

Advertisement
Update:2019-02-19 11:03 IST

ఆయన ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి. ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. పుల్వామా దాడి తర్వాత దేశమంతా కశ్మీరీలకు అండగా ఉంటే…. ఆ గవర్నర్ మాత్రం కశ్మీరీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..

మేఘాలయ గవర్నర్ తథాగత రాయ్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. దాంట్లో ఏం రాశారంటే.. ఇండియన్ ఆర్మీ రిటైర్డ్ కల్నల్ ఒకరు ఈ అప్పీలు చేశారు. కశ్మీర్‌లో పర్యటించొద్దు. వచ్చే రెండేళ్లలో అమర్‌నాథ్ యాత్రకు కూడా వెళ్లొద్దు. కశ్మీరీలు అమ్మే వస్తువులను అసలు కొనొద్దు. కశ్మీర్‌కు సంబంధించిన ప్రతీదాన్ని బహిష్కరించండి అని పేర్కొన్నారు.

ఈ ట్వీట్ సంచలనాలకు దారి తీయడమే కాకుండా గవర్నర్ తథాగత రాయ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన మరో ట్వీట్‌లో వివరణ ఇచ్చారు. ఇది నా సొంత అభిప్రాయం కాదు. ఒక కల్నల్ నుంచి వచ్చిన సూచన మాత్రమే అని ఆయన చెప్పారు.

Tags:    
Advertisement

Similar News