ప్రేమికుల రోజును గాలికి వదిలేశారు

ఈరోజు ప్రేమికుల రోజు. ఆ తర్వాత వీకెండ్. మొత్తంగా బంగారం లాంటి 3 రోజులు. ఇలాంటి మంచి అవకాశాన్ని టాలీవుడ్ చేజేతులా వదులుకుంది. అవును… వెదికి మరీ వీకెండ్స్, ఫెస్టివల్స్ పట్టుకొని సినిమాలు రిలీజ్ చేస్తుంటారు టాలీవుడ్ జనాలు. అవసరమైతే మరో సినిమాతో కొట్లాటకు కూడా దిగుతారు. అలాంటిది అంతా కలిసి వాలంటైన్స్ డే లాంటి మంచి వీకెండ్ ను పరభాషా చిత్రాలకు వదిలేశారు. ఈరోజు ఒక్కటంటే ఒక్క స్ట్రయిట్ మూవీ కూడా థియేటర్లలోకి రావడం లేదు. […]

Advertisement
Update:2019-02-14 03:13 IST

ఈరోజు ప్రేమికుల రోజు. ఆ తర్వాత వీకెండ్. మొత్తంగా బంగారం లాంటి 3 రోజులు. ఇలాంటి మంచి అవకాశాన్ని టాలీవుడ్ చేజేతులా వదులుకుంది. అవును… వెదికి మరీ వీకెండ్స్, ఫెస్టివల్స్ పట్టుకొని సినిమాలు రిలీజ్ చేస్తుంటారు టాలీవుడ్ జనాలు. అవసరమైతే మరో సినిమాతో కొట్లాటకు కూడా దిగుతారు. అలాంటిది అంతా కలిసి వాలంటైన్స్ డే లాంటి మంచి వీకెండ్ ను పరభాషా చిత్రాలకు వదిలేశారు.

ఈరోజు ఒక్కటంటే ఒక్క స్ట్రయిట్ మూవీ కూడా థియేటర్లలోకి రావడం లేదు. మళయాళంలో ఓ మోస్తరు హిట్ అయిన ఓ సినిమా లవర్స్ డే గా థియేటర్లలోకి వస్తోంది. అటు తమిళ్ లో తెరకెక్కిన దేవ్ అనే సినిమా అదే పేరుతో తెలుగులోకి డబ్ అయి రిలీజ్ అవుతోంది. ఈ రెండు సినిమాలు మినహా స్ట్రయిట్ తెలుగు మూవీ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు.

అసలే బాక్సాఫీస్ డల్ గా ఉంది. ఎఫ్-2 హంగామా ముగిసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో కూడా వచ్చేసింది. యాత్ర లాంటి ఎమోషనల్ మూవీ తప్పితే మార్కెట్లో మరో సినిమా లేదు. ఇలాంటి టైమ్ లో ఓ మోస్తరు అంచనాలున్న సినిమా వచ్చి, చిన్న టాక్ తెచ్చుకున్నా అది సేఫ్ వెంచర్ అనిపించుకుంటుంది. ఈమాత్రం ప్లానింగ్ కూడా ఏ మేకర్ చేయలేకపోయాడు. అటు సమ్మర్ మార్కెట్ కోసం మాత్రం అప్పుడే కుమ్ములాట మొదలైంది.

Tags:    
Advertisement

Similar News