మజిలీ... చైతూ నుంచి మరో మాస్ మూవీ

మొన్నటివరకు ఈ సినిమాను హార్ట్ టచింగ్ మూవీగా, క్లాస్ లవ్ స్టోరీగా చూశారంతా. కానీ ఈరోజు రిలీజైన ట్రయిలర్ చూస్తే మాత్రం నాగచైతన్య మరోసారి మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. అవును.. నాగచైతన్య-సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మజిలీ టీజర్ రిలీజైంది. వాలంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ టీజర్ లో క్రికెట్ ఆడే కుర్రాడిగా, పెళ్లయి రోడ్లపై తిరిగే మాస్ యువకుడిగా రెండు ఛాయల్లో కనిపిస్తున్నాడు నాగచైతన్య. https://t.co/SwNQAGYN3MWhy I loved #MajiliTeaser is1. The team […]

Advertisement
Update:2019-02-14 15:20 IST

మొన్నటివరకు ఈ సినిమాను హార్ట్ టచింగ్ మూవీగా, క్లాస్ లవ్ స్టోరీగా చూశారంతా. కానీ ఈరోజు రిలీజైన ట్రయిలర్ చూస్తే మాత్రం నాగచైతన్య మరోసారి మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. అవును.. నాగచైతన్య-సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మజిలీ టీజర్ రిలీజైంది. వాలంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ టీజర్ లో క్రికెట్ ఆడే కుర్రాడిగా, పెళ్లయి రోడ్లపై తిరిగే మాస్ యువకుడిగా రెండు ఛాయల్లో కనిపిస్తున్నాడు నాగచైతన్య.

స‌మంత ఇందులో మ‌ధ్య త‌ర‌గ‌తి గృహిణి పాత్ర‌లో న‌టిస్తోంది. భ‌ర్త‌పై ఎంతో జాగ్ర‌త్త‌గా.. ప్రేమ‌గా ఉండే భార్య‌గా ఆమె కనిపిస్తోంది. రియల్ లైఫ్ లో కూడా వీళ్లిద్దరూ భార్యాభర్తలు కాబట్టి సినిమాలో కూడా కెమిస్ట్రీ బాగా పండే ఛాన్స్ ఉంది. సెకెండ్ హీరోయిన్ గా నటించిన దివ్యాంశ కౌశిక్ కూడా టీజర్ లో ఉంది. ఆమె ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందనే విషయం కూడా టీజర్ చూస్తే అర్థమౌతోంది.

దేర్ ఈజ్ ల‌వ్.. దేర్ ఈజ్ పెయిన్ అనే ట్యాగ్ లైన్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయాలని నిర్ణయించారు. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. నాగచైతన్య మాస్ ప్రయత్నం ఏమౌతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News