ఉద్యోగి అయినా, మా లీడర్ అయినా సరే ఫస్ట్ చెప్పుతో కొట్టండి....
టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాలను పొందుతున్న లబ్దిదారుల నుంచి లంచం డిమాండ్ చేసే వారిని చెప్పుతో కొట్టాల్సిందిగా పిలుపునిచ్చారు. ఉద్యోగులు, బ్రోకర్లు ఎవరైనా సరే లంచం అడిగితే చెప్పుతో కొట్టి మాట్లాడాల్సిందిగా సూచించారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి లక్ష రూపాయలు మంజూరు చేస్తే లబ్ధి దారుడి వెంట పడి పది వేలు లంచం వసూలు చేస్తున్నారని కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్లు ఉచితంగా రైతులకు అందాయని తాను అనుకున్నానని… కానీ కొందరు రైతులను […]
టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాలను పొందుతున్న లబ్దిదారుల నుంచి లంచం డిమాండ్ చేసే వారిని చెప్పుతో కొట్టాల్సిందిగా పిలుపునిచ్చారు. ఉద్యోగులు, బ్రోకర్లు ఎవరైనా సరే లంచం అడిగితే చెప్పుతో కొట్టి మాట్లాడాల్సిందిగా సూచించారు.
సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి లక్ష రూపాయలు మంజూరు చేస్తే లబ్ధి దారుడి వెంట పడి పది వేలు లంచం వసూలు చేస్తున్నారని కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్లు ఉచితంగా రైతులకు అందాయని తాను అనుకున్నానని… కానీ కొందరు రైతులను అడిగితే ట్రాక్టర్లు సొంతం చేసుకునేందుకు 50వేల వరకు లంచంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పారన్నారు.
కల్యాణ లక్ష్మీ పథకంలోనూ బ్రోకర్లు లంచాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలా ఏ పథకంలోనైనా సరే లంచం అడిగితే ఉద్యోగి అయినా సరే, బ్రోకర్లు అయినా సరే, చివరకు వాడు టీఆర్ఎస్ లీడర్ అయినా సరే చెప్పుతో కొట్టి సమాధానం చెప్పండి అని పిలుపునిచ్చారు కొప్పుల ఈశ్వర్.