హ‌రీష్‌ రావు..... ఈ వార్తల్లో నిజమెంత?

గులాబీ ద‌ళం రాజకీయాలు కొంత కాలంగా సైలెంట్‌గా మారాయి. కేటీఆర్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అయిన త‌ర్వాత కొంత హ‌డావుడి న‌డిచింది. కేసీఆర్ ప్రాజెక్టుల సంద‌ర్శ‌న పూర్త‌యింది. ఆత‌ర్వాత కేసీఆర్‌, కేటీఆర్ పెద్ద‌గా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. గులాబీ రాజకీయాలు పూర్తిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. కాంగ్రెస్‌, బీజేపీలు ఎంపీ అభ్య‌ర్థుల ఎంపిక అంటూ ఏదో ఒక హడావుడి చేస్తున్నాయి. అయితే గులాబీ ద‌ళంలో ఏం జ‌రుగుతుంద‌నేది మాత్రం స‌స్పెన్స్‌గా మారింది. సైలెంట్‌గా ఎంపీ అభ్య‌ర్థుల ఎంపిక జ‌రుగుతుంద‌న్న […]

Advertisement
Update:2019-02-13 02:23 IST

గులాబీ ద‌ళం రాజకీయాలు కొంత కాలంగా సైలెంట్‌గా మారాయి. కేటీఆర్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అయిన త‌ర్వాత కొంత హ‌డావుడి న‌డిచింది. కేసీఆర్ ప్రాజెక్టుల సంద‌ర్శ‌న పూర్త‌యింది. ఆత‌ర్వాత కేసీఆర్‌, కేటీఆర్ పెద్ద‌గా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. గులాబీ రాజకీయాలు పూర్తిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి.

కాంగ్రెస్‌, బీజేపీలు ఎంపీ అభ్య‌ర్థుల ఎంపిక అంటూ ఏదో ఒక హడావుడి చేస్తున్నాయి. అయితే గులాబీ ద‌ళంలో ఏం జ‌రుగుతుంద‌నేది మాత్రం స‌స్పెన్స్‌గా మారింది. సైలెంట్‌గా ఎంపీ అభ్య‌ర్థుల ఎంపిక జ‌రుగుతుంద‌న్న విష‌యం మాత్రం తెలుస్తోంది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు ఫామ్‌హౌజ్‌లో కార్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తున్నార‌ని స‌మాచారం.

టీఆర్ఎస్ ఎంపీలుగా ఎవ‌రెవ‌రు పోటీ చేస్తార‌న్న విష‌యం చ‌ర్చ‌కు రాగానే ఓ న్యూస్ తెగ వైర‌ల్ అవుతోంది. మెద‌క్ నుంచి హ‌రీష్‌రావుని ఎంపీగా బ‌రిలోకి దించుతార‌నే టాపిక్ తెర‌పైకి వ‌స్తోంది. ఈ న్యూస్ ఏ క్యాంప్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తుందో తెలియ‌దు. కానీ హ‌రీష్‌రావును ఎంపీగా పంపిస్తార‌ని మాత్రం టాక్ న‌డుస్తోంది. హ‌రీష్‌రావుపై కావాల‌నే ఈ న్యూస్‌ను ప్ర‌చారం చేస్తున్నారా? ఆయ‌న‌తో మైండ్‌గేమ్ ఆడుతున్నారా? అనే విష‌యం తేల‌డం లేదు.

హ‌రీష్‌రావు ఎంపీగా గెలిస్తే…ఆయ‌న ఖాళీ చేసే సిద్ధిపేట నుంచి ఆయ‌న భార్య శ్రీనీత బ‌రిలో ఉంటార‌ని కాంగ్రెస్ నేత ర‌మ్యారావు వాట్సాప్‌లో మేసేజ్ పెట్టార‌ని ఓ ప్ర‌చారం న‌డుస్తోంది. ఈ విష‌యం ప‌ట్టుకుని…. హరీశ్ రావును పార్లమెంట్ కు పంపించి.. ఆ స్థానం నుంచి ఆయన భార్య శ్రీనీతను పోటీ చేయిస్తార‌ని క్యాంపెయిన్ మొద‌లైంది.

Tags:    
Advertisement

Similar News