రజనీ కూతురు పెళ్లి... తొలి శుభలేఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి... కారణం తెలుసా?
రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని పలుమార్లు వార్తలు వచ్చాయి. సొంత పార్టీ అంటూ కొన్ని సార్లు.. బీజేపీలో చేరతారని మరి కొన్ని సార్లు పుకార్లు చక్కర్లు కొట్టాయి. అయితే అనూహ్యంగా నిన్న ఆయన కాంగ్రెస్ పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు తిరునవుక్కరాసర్‌ని కలిశారు. ఆయనను కలవడానికి గల కారణాన్ని కూడా రజనీ వివరించారు. రజనీ కూతురు సౌందర్య వివాహం ఫిబ్రవరి 11న విషగన్ వనగమూడితో జరుగనుంది. దీనికి సంబంధించిన ఆహ్వానాలను స్వయంగా రజనీకాంతే వెళ్లి ప్రముఖులందరికీ అందిస్తున్నారు. అయితే […]
రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని పలుమార్లు వార్తలు వచ్చాయి. సొంత పార్టీ అంటూ కొన్ని సార్లు.. బీజేపీలో చేరతారని మరి కొన్ని సార్లు పుకార్లు చక్కర్లు కొట్టాయి. అయితే అనూహ్యంగా నిన్న ఆయన కాంగ్రెస్ పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు తిరునవుక్కరాసర్‌ని కలిశారు. ఆయనను కలవడానికి గల కారణాన్ని కూడా రజనీ వివరించారు.
రజనీ కూతురు సౌందర్య వివాహం ఫిబ్రవరి 11న విషగన్ వనగమూడితో జరుగనుంది. దీనికి సంబంధించిన ఆహ్వానాలను స్వయంగా రజనీకాంతే వెళ్లి ప్రముఖులందరికీ అందిస్తున్నారు. అయితే మొదటి శుభలేక మాత్రం తిరునవుక్కరాసర్‌కి ఇచ్చారు. తన కూతురు పెళ్లి ఏర్పాట్లన్నింటినీ ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు. అందుకే తరునవుక్కరాసర్‌కి తొలి పత్రిక అందించానని అసలు విషయం చెప్పారు. దీనికి నా రాజకీయ ప్రయాణానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
రజనీ స్వయంగా సినీ నటుడు ప్రభుకు శుభలేక అందించి ఫొటోలు దిగారు. ఈ చిత్రాలను ప్రభు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.