షూటింగ్ కు పర్మిషన్ ఇవ్వలేదని ఏకంగా సెట్ వేసేశారు

“సాహో” సినిమా ఇప్పటికే చాలా లేట్ అవుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ గోల గోల చేస్తున్నారు. కనీసం ఫిబ్రవరి లో అయినా ఈ సినిమా షూటింగ్ అయిపోతుందని అందరూ అనుకుంటుంటే, అప్పటికి కూడా షూటింగ్ అయిపోదని తెలుస్తోంది. ఎందుకుంటే ప్రస్తుతం హైదరాబాద్ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాకి సంబంధించి ఒక బ్రిడ్జి సెట్ వేస్తున్నారట మూవీ యూనిట్. మొదట ముంబై వెళ్ళి ‘సి లింక్ బ్రిడ్జి’ మీద ఈ ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేసారట మూవీ యూనిట్. […]

Advertisement
Update:2019-02-07 11:52 IST

“సాహో” సినిమా ఇప్పటికే చాలా లేట్ అవుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ గోల గోల చేస్తున్నారు. కనీసం ఫిబ్రవరి లో అయినా ఈ సినిమా షూటింగ్ అయిపోతుందని అందరూ అనుకుంటుంటే, అప్పటికి కూడా షూటింగ్ అయిపోదని తెలుస్తోంది.

ఎందుకుంటే ప్రస్తుతం హైదరాబాద్ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాకి సంబంధించి ఒక బ్రిడ్జి సెట్ వేస్తున్నారట మూవీ యూనిట్. మొదట ముంబై వెళ్ళి ‘సి లింక్ బ్రిడ్జి’ మీద ఈ ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేసారట మూవీ యూనిట్. కానీ అక్కడ వారికి పర్మిషన్ దొరకకపోవడం తో ఇప్పుడు అదే రూపం లో ఉండే సెట్ ని భారీ ఖర్చుతో హైదరబాద్ లో వేస్తున్నారట.

ఇక్కడే ప్రభాస్ మీద కొన్ని ఫైట్ సీక్వెన్స్ షూట్ చేస్తారట. ఈ ఫైట్ సీక్వెన్స్ అయిపోగానే మళ్ళీ వచ్చే నెల నుంచి సాంగ్ షూట్ లో బిజీగా ఉంటారట.

సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని ఎలాగైనా ఆగస్ట్ 15 న రిలీజ్ చేయాలి అనే దిశగా మూవీ యూనిట్ పరుగులు తీస్తుంది.

Tags:    
Advertisement

Similar News