మరో హీరోయిన్ పెళ్లికి రెడీ
మొన్నటికిమొన్న స్వాతి పెళ్లి చేసుకుంది. భర్తతో ఇండోనేషియాలో కాపురం పెట్టింది. రీసెంట్ గా మరో హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ కూడా పెళ్లి ప్రకటించింది. నిశ్చితార్థం కూడా పూర్తయిన తర్వాత పెళ్లి మేటర్ బయటపెట్టింది. ఇప్పుడు మరో హీరోయిన్ ఈ లిస్ట్ లోకి చేరింది. ఈసారి ఎమీ జాక్సన్ వంతు. ఈ ఎన్నారై హీరోయిన్ కూడా పెళ్లి కబురు మోసుకొచ్చింది. దాదాపు రెండేళ్లుగా జార్జ్ పనైటోతో డేటింగ్ చేస్తోంది ఎమీ. మొన్న జనవరి 1న వీళ్ల ఎంగేజ్ మెంట్ […]
మొన్నటికిమొన్న స్వాతి పెళ్లి చేసుకుంది. భర్తతో ఇండోనేషియాలో కాపురం పెట్టింది. రీసెంట్ గా మరో హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ కూడా పెళ్లి ప్రకటించింది. నిశ్చితార్థం కూడా పూర్తయిన తర్వాత పెళ్లి మేటర్ బయటపెట్టింది. ఇప్పుడు మరో హీరోయిన్ ఈ లిస్ట్ లోకి చేరింది. ఈసారి ఎమీ జాక్సన్ వంతు.
ఈ ఎన్నారై హీరోయిన్ కూడా పెళ్లి కబురు మోసుకొచ్చింది. దాదాపు రెండేళ్లుగా జార్జ్ పనైటోతో డేటింగ్ చేస్తోంది ఎమీ. మొన్న జనవరి 1న వీళ్ల ఎంగేజ్ మెంట్ కూడా పూర్తయింది. ఈ ఏడాదంతా ఎంజాయ్ చేసి, వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించింది ఎమీ. పెళ్లికి వేదిక కూడా ఖరారు చేసింది.
అందరు సెలబ్రిటీల్లానే ఎమీ జాక్సన్ కూడా వెడ్డింగ్ డెస్టినేషన్ వైపు మొగ్గుచూపించింది. గ్రీస్ దేశంలోని మైకోనాస్ దీవిలో ఎమీ-జార్జ్ పెళ్లి జరగబోతోంది. ఈ మేరకు 10 రోజుల పాటు టోటల్ ఐలాండ్ ను బుక్ చేసేసింది ఎమీ జాక్సన్. పెళ్లి లోపు ఒప్పుకున్న సినిమాలన్నీ కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది.