రఫేల్ విమానాలకు మరో చిక్కు...!

రఫేల్ విమానాల కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే ప్రతిపక్ష కాంగ్రెస్ సహా పలు పార్టీలు అధికార ఎన్డీయే ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకు పడుతున్నాయి. దేశ రక్షణలో కీలకం కానున్న ఈ విమానాల కొనుగోలులో భారీ స్కాం జరిగిందని ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, తాజాగా రఫేల్‌కు మరో చిక్కొచ్చి పడింది. తొలి విడత రఫేల్ విమానాలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో మన దేశానికి చేరుకోనున్నాయి. అయితే వీటికి సంబంధించిన హ్యాంగర్ (విమానాలను ఉంచే చోటు) పనులు చేస్తున్న […]

Advertisement
Update:2019-01-29 11:08 IST

రఫేల్ విమానాల కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే ప్రతిపక్ష కాంగ్రెస్ సహా పలు పార్టీలు అధికార ఎన్డీయే ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకు పడుతున్నాయి. దేశ రక్షణలో కీలకం కానున్న ఈ విమానాల కొనుగోలులో భారీ స్కాం జరిగిందని ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, తాజాగా రఫేల్‌కు మరో చిక్కొచ్చి పడింది.

తొలి విడత రఫేల్ విమానాలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో మన దేశానికి చేరుకోనున్నాయి. అయితే వీటికి సంబంధించిన హ్యాంగర్ (విమానాలను ఉంచే చోటు) పనులు చేస్తున్న మిలటరీ ఇంజనీర్ సర్వీస్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎంఈఎస్) పనులను ఆపేస్తామని హెచ్చరించింది. ఎంఈఎస్‌కు దాదాపు 2000 కోట్ల రూపాయల బకాయిలు రావల్సి ఉంది. ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం, రక్షణ శాఖలను సంప్రదించినా నిధులు మాత్రం విడుదల కావట్లేదు.

రఫేల్ విమానాల కోసం అంబాలా, హసిమర ప్రాంతాల్లో హ్యాంగర్లను నిర్మిస్తోంది. గత ఎనిమిది నెలల నుంచి పనులు మందకొడిగా సాగుతున్నాయి. అయితే రెండు నెలల నుంచి నిధుల లభ్యత లేక పనులు పూర్తిగా ఆపేశారు. ఈ విషయమై ఎంఈఎస్ అధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతూ…. గత కొన్ని నెలలుగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని పనులు చేస్తున్నాం. కానీ ఇప్పుడు బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి కనపరచడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పనులు చేయడం కష్టమేనని ఆయన వ్యాఖ్యానించారు.

సెప్టెంబర్‌లోగా పనులు పూర్తి కావల్సి ఉండగా ఇప్పటి వరకు 40 నుంచి 50 శాతం మాత్రమే పనులు జరిగాయి. బకాయిల నిమిత్తం గతంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ని కలిస్తే పూర్తి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ 250 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని ఎంఈఎస్ ప్రతినిధులు చెబుతున్నారు. వచ్చిన ఆ నిధులు కూడా హెచ్ఏఎల్‌కు మళ్లించవలసి వచ్చిందన్నారు.

ఎంఈఎస్ కింద 20 వేల మంది కాంట్రాక్టర్లు, 50 లక్షల మంది కార్మికులు ఉన్నారు. వీరు రక్షణ శాఖ పరిధిలో సరిహద్దు గోడలు, డంపులు, మిస్సైల్ షెడ్లు, బంకర్లు, హెలీప్యాడ్లు వంటివి నిర్మిస్తుంటారు.

Tags:    
Advertisement

Similar News