గాయాలతో ధోని దూరం... అతడికి ఛాన్స్‌

ఉరకలెత్తే ఫాంలో ఉన్న మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోని … న్యూజిలాండ్‌ సీరిస్‌లో మూడో వన్డేకు దూరమయ్యాడు. గాయాల కారణంగా ధోని మ్యాచ్‌ నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని కెప్టెన్ కోహ్లి వెల్లడించారు. గాయాలతో బాధపడుతున్న ధోనికి విశ్రాంతి ఇస్తున్నట్టు తెలిపారు. ధోని తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఇటీవల వరుస మ్యాచ్‌ లలో ధోని తన సత్తా చాటుతున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌లో అర్థసెంచరీలు చేసిన ధోని… నాలుగో మ్యాచ్‌లో 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. […]

Advertisement
Update:2019-01-28 02:57 IST

ఉరకలెత్తే ఫాంలో ఉన్న మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోని … న్యూజిలాండ్‌ సీరిస్‌లో మూడో వన్డేకు దూరమయ్యాడు. గాయాల కారణంగా ధోని మ్యాచ్‌ నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని కెప్టెన్ కోహ్లి వెల్లడించారు.

గాయాలతో బాధపడుతున్న ధోనికి విశ్రాంతి ఇస్తున్నట్టు తెలిపారు. ధోని తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఇటీవల వరుస మ్యాచ్‌ లలో ధోని తన సత్తా చాటుతున్నాడు.

వరుసగా మూడు మ్యాచ్‌లో అర్థసెంచరీలు చేసిన ధోని… నాలుగో మ్యాచ్‌లో 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మెరుపు వేగంతో స్టంపింగ్స్‌ చేస్తూ అబ్బురపరుస్తున్నాడు. గాయం కారణంగా ధోని దూరమైన నేపథ్యంలో… అతడి స్ధానంలో దినేష్ కార్తీక్‌కు అవకాశం కల్పిస్తున్నారు.

ఐదు మ్యాచ్‌ల సీరిస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు వరుసగా గెలిచిన టీమిండియా… మూడో మ్యాచ్ గెలవడం ద్వారా సిరీస్‌ను సొంతం చేసుకునేందుకు ఉరకలేస్తోంది.

Tags:    
Advertisement

Similar News