మిస్టర్ మజ్ను 3 రోజుల వసూళ్లు

కొంతమంది యావరేజ్ అన్నారు. మరికొందరు ఫ్లాప్ అన్నారు. మిస్టర్ మజ్ను సినిమా ఫ్లాప్ అనే విషయం తాజా వసూళ్లతో తేలిపోయింది. అవును.. మిస్టర్ మజ్ను కూడా అఖిల్ కు కలిసిరాలేదు. కెరీర్ లో వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకున్నాడు ఈ అక్కినేని హీరో. నిన్నటితో ఫస్ట్ వీకెండ్ (3 రోజులు) పూర్తిచేసుకుంది మిస్టర్ మజ్ను. ఈ 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 9 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. వరల్డ్ వైడ్ ఈ సినిమాను 24 […]

Advertisement
Update:2019-01-28 14:21 IST

కొంతమంది యావరేజ్ అన్నారు. మరికొందరు ఫ్లాప్ అన్నారు. మిస్టర్ మజ్ను సినిమా ఫ్లాప్ అనే విషయం తాజా వసూళ్లతో తేలిపోయింది.

అవును.. మిస్టర్ మజ్ను కూడా అఖిల్ కు కలిసిరాలేదు. కెరీర్ లో వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకున్నాడు ఈ అక్కినేని హీరో.

నిన్నటితో ఫస్ట్ వీకెండ్ (3 రోజులు) పూర్తిచేసుకుంది మిస్టర్ మజ్ను. ఈ 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 9 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. వరల్డ్ వైడ్ ఈ సినిమాను 24 కోట్ల రూపాయలకు అమ్మారు. ఫస్ట్ వీకెండ్ లో 9 కోట్లు అంటే.. బ్రేక్-ఈవెన్ కావడానికి ఇంకా 15 కోట్లు రావాలి. అన్ని వసూళ్లు రావడం దాదాపు అసాధ్యమనే విషయం తేలిపోయింది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఈ సినిమాకు ఏపీ, నైజాంలో కలుపుకొని ఇప్పటివరకు 7 కోట్ల 38 లక్షల రూపాయల షేర్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 18 కోట్ల రూపాయలకు అమ్మారు. అంటే ఇంకో 10 కోట్లు రావాలన్నమాట. ఏపీ, నైజాంలో మిస్టర్ మజ్ను 3 రోజుల వసూళ్లు (షేర్) ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 2.82 కోట్లు
సీడెడ్ – రూ. 1.07 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.95 కోట్లు
ఈస్ట్ – రూ. 0.49 కోట్లు
వెస్ట్ – రూ. 0.37 కోట్లు
గుంటూరు – రూ. 0.86 కోట్లు
కృష్ణా – రూ. 0.58 కోట్లు
నెల్లూరు – రూ. 0.24 కోట్లు

Tags:    
Advertisement

Similar News