ఫ్లాప్ కొట్టినా.... క్రేజ్ తో ముందుకెళ్తున్న శర్వానంద్

శర్వానంద్ రీసెంట్ గా “పడి పడి లేచే మనసు” సినిమాతో ఫ్లాప్ ని అందుకున్నాడు. హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా పై శర్వానంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఫైనల్ గా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలబడిపోయింది. ఇక ఇప్పుడు శర్వానంద్…. ప్రస్తుతం సూధీర్ వర్మ తో చేసే సినిమా పైనే నమ్మకం పెట్టుకున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా శాటీలైట్ రైట్స్ ని […]

Advertisement
Update:2019-01-26 09:41 IST

శర్వానంద్ రీసెంట్ గా “పడి పడి లేచే మనసు” సినిమాతో ఫ్లాప్ ని అందుకున్నాడు. హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా పై శర్వానంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఫైనల్ గా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలబడిపోయింది.

ఇక ఇప్పుడు శర్వానంద్…. ప్రస్తుతం సూధీర్ వర్మ తో చేసే సినిమా పైనే నమ్మకం పెట్టుకున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా శాటీలైట్ రైట్స్ ని ప్రముఖ టీవీ ఛానల్ ఎనిమిది కోట్లు పెట్టి కొన్నారట. అసలు శర్వానంద్ కెరీర్ లోనే ఇది రికార్డ్ ప్రైస్ గా నమోదు అయ్యింది.

అయితే ఫ్లాప్ కొట్టిన హీరోకి ఈ రేంజ్ లో మార్కెట్ అయ్యింది అంటే అది ఆశ్చర్యం అనే చెప్పాలి. ఇదిలా ఉంటే శర్వానంద్ ఈ సినిమాలో డాన్ గా నటిస్తూనే…. మరో వైపు వృద్దుడి పాత్రలో కూడా కనిపించనున్నాడు. సుధీర్ వర్మ ఈ సినిమాని కూడా థ్రిల్లర్ తరహాలో రూపొందిస్తున్నాడు. కళ్యాణి ప్రిదర్శిని హీరోయిన్ గా నటిస్తున్నఈ సినిమాకి ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News