దిల్ రాజు నిర్ణయం చైతుకి ఊరటనిచ్చింది

సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ సినిమాగా తెరకెక్కుతున్న “మహర్షి” సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ప్రస్తుతం పొలాచ్చి లో పాట షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే దుబాయ్ కి వెళ్లనుంది. అక్కడ నుంచు మళ్ళీ హైదరాబాద్ కి వచ్చి కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తారట మూవీ యూనిట్. ఇక ఈ షూటింగ్ షెడ్యూల్స్ ని చూస్తుంటే ఈ సినిమా అనుకున్న డేట్ కంటే కూడా కాస్త ఆలస్యంగానే రాబోతుందని అర్ధం […]

Advertisement
Update:2019-01-24 07:26 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ సినిమాగా తెరకెక్కుతున్న “మహర్షి” సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ప్రస్తుతం పొలాచ్చి లో పాట షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే దుబాయ్ కి వెళ్లనుంది.

అక్కడ నుంచు మళ్ళీ హైదరాబాద్ కి వచ్చి కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తారట మూవీ యూనిట్. ఇక ఈ షూటింగ్ షెడ్యూల్స్ ని చూస్తుంటే ఈ సినిమా అనుకున్న డేట్ కంటే కూడా కాస్త ఆలస్యంగానే రాబోతుందని అర్ధం అవుతుంది.

నిజానికి నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని ఏప్రిల్ 5 న రిలీజ్ చేద్దాం అని భావించాడట. కానీ ఇప్పుడు ఈ సినిమా ఏప్రిల్ 25 న రిలీజ్ అవుతుంది. ఈ విషయం తెలిసి మహేష్ బాబు అభిమానులు బాధపడుతుంటే… అక్కినేని నాగ చైతన్య మాత్రం చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్నాడట.

ఎందుకంటే ఏప్రిల్ 5 న నాగ చైతన్య హీరోగా వస్తున్న “మజిలి” సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే “మహర్షి” సినిమా రిలీజ్ డేట్ ముందుగానే అనౌన్స్ చేయడంతో…. నాగ చైతన్య తన సినిమాని పోస్ట్ పోన్ చేసుకుందామని అనుకున్నాడట. కానీ ఇప్పుడు “మహర్షి” పోస్ట్ పోన్ అయ్యిందని తెలిసి నాగ చైతన్య చాలా హ్యాపీ గా ఉన్నాడని ఫిలిం నగర్ టాక్.

Tags:    
Advertisement

Similar News