శంకర్ హంగామా మొదలైంది

రామ్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో కొత్త సినిమా ఎనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడా సినిమా గ్రాండ్ గా లాంఛ్ అయింది. ఈరోజు ఇస్మార్ట్ శంకర్ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఎలాంటి హడావుడి లేకుండా, పూరి కనెక్ట్స్ ఆఫీస్ లోనే యూనిట్ సభ్యుల మధ్య కొబ్బరికాయ కొట్టారు. తొలి షాట్ కు నిర్మాతల్లో ఒకరైన ఛార్మి క్లాప్ కొట్టగా, రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ కెమెరా స్విచాన్ చేశారు. రేపట్నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ […]

Advertisement
Update:2019-01-23 16:59 IST

రామ్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో కొత్త సినిమా ఎనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడా సినిమా గ్రాండ్ గా లాంఛ్ అయింది. ఈరోజు ఇస్మార్ట్ శంకర్ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఎలాంటి హడావుడి లేకుండా, పూరి కనెక్ట్స్ ఆఫీస్ లోనే యూనిట్ సభ్యుల మధ్య కొబ్బరికాయ కొట్టారు.

తొలి షాట్ కు నిర్మాతల్లో ఒకరైన ఛార్మి క్లాప్ కొట్టగా, రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ కెమెరా స్విచాన్ చేశారు. రేపట్నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. సినిమాల్ని చకచకా పూర్తిచేసే పూరి జగన్నాధ్, ఇస్మార్ట్ శంకర్ ప్రాజెక్టును మే నెలలో థియేటర్లలోకి తీసుకొస్తానంటున్నాడు.

ఇదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా. ఈ జానర్ ఇటు రామ్ తో పాటు అటు పూరి జగన్నాధ్ కు కూడా కొత్త. అందుకే ఇద్దరూ కలిసి చేయడానికి ఒప్పుకున్నారు. సినిమాకు సంబంధించి రామ్ లుక్ పై ఎలాంటి సస్పెన్స్ మెయింటైన్ చేయకుండా.. శంకర్ గెటప్ లోనే రామ్ ను ఓపెనింగ్ కు తీసుకొచ్చారు.

Tags:    
Advertisement

Similar News