150 కోట్ల ఆఫర్ ను తిరస్కరించాడు
దాదాపు 2వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది ఆర్-ఆర్-ఆర్ ప్రాజెక్టు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు దానయ్య. విడుదల కంటే ముందు, ఇంకా చెప్పాలంటే థియేట్రికల్ బిజినెస్ కంటే ముందే ఆ 200 కోట్లను వెనక్కి తీసుకునే పెద్ద ఐడియా వేశాడు. అదే శాటిలైట్ రైట్స్. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఇప్పుడు మార్కెట్లో హాట్ […]
దాదాపు 2వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది ఆర్-ఆర్-ఆర్ ప్రాజెక్టు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు దానయ్య. విడుదల కంటే ముందు, ఇంకా చెప్పాలంటే థియేట్రికల్ బిజినెస్ కంటే ముందే ఆ 200 కోట్లను వెనక్కి తీసుకునే పెద్ద ఐడియా వేశాడు. అదే శాటిలైట్ రైట్స్.
ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఇప్పుడు మార్కెట్లో హాట్ కేక్ లా మారాయి. వంద కోట్ల రూపాయలు కళ్లుమూసుకొని ఇచ్చేందుకు టీవీ ఛానెళ్లు ఎగబడుతున్నాయి. ఇందులో భాగంగా జీ తెలుగు సంస్థ.. ఆర్-ఆర్-ఆర్ ప్రాజెక్టుకు 150 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకొచ్చింది. అన్ని భాషల్లో శాటిలైట్ రైట్స్ తో పాటు డిజిటల్ రైట్స్ అప్పగిస్తే 150 కోట్లు ఇస్తామనేది డీల్.
150 కోట్లు కళ్లముందు ఉన్నప్పటికీ దానయ్య మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇతడి టార్గెట్ 150 కోట్లు కాదు. శాటిలైట్, డిజిటల్ కింద ఏకంగా 200 కోట్లు కొల్లగొట్టాలనేది ఈ నిర్మాత ఆలోచన. మరి రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి క్రేజీ కాంబోలో వస్తున్న ఈ సినిమాను అంత మొత్తానికి ఏ ఛానెల్ దక్కించుకుంటుందో చూడాలి.