వినయ విధేయ.. 30 కోట్లు నష్టం?

సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను అటుఇటుగా 92 కోట్ల రూపాయలకు అమ్మారు. మొదటి వారంలోనే 50 కోట్లు షేర్ సాధించిన ఈ సినిమా.. రెండో వారానికి కేవలం 61 కోట్ల రూపాయలకు మాత్రమే పరిమితమైంది. ఇక ఈ సినిమా ఎంత మాత్రం ఆడే సినిమా కాదు. మహా అయితే మరో 3 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది. సో.. ఎలా చూసుకున్నా బయ్యర్లకు ఈ సినిమా 30 కోట్ల […]

Advertisement
Update:2019-01-21 12:24 IST

సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను అటుఇటుగా 92 కోట్ల రూపాయలకు అమ్మారు. మొదటి వారంలోనే 50 కోట్లు షేర్ సాధించిన ఈ సినిమా.. రెండో వారానికి కేవలం 61 కోట్ల రూపాయలకు మాత్రమే పరిమితమైంది. ఇక ఈ సినిమా ఎంత మాత్రం ఆడే సినిమా కాదు. మహా అయితే మరో 3 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది. సో.. ఎలా చూసుకున్నా బయ్యర్లకు ఈ సినిమా 30 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉంది.

లక్కీగా సంక్రాంతికి రిలీజ్ అయింది కాబట్టి ఈ సినిమాకు ఈ మాత్రమైనా వసూళ్లు వచ్చాయి. అదే సంక్రాంతి కాకుండా మరో సీజన్ లో వచ్చి ఉంటే సగానికి పైగా నష్టాలు మూటగట్టుకొని ఉండేది. అటు ఓవర్సీస్ లో ఈ సినిమా అతిపెద్ద డిజాస్టర్ దిశగా రూపుదిద్దుకుంటోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ 10 రోజుల్లో వినయ విధేయ రామ సినిమాకు వచ్చిన షేర్ వివరాలు ఇలా ఉన్నాయి.

  • నైజాం : రూ. 12.50 కోట్లు
  • సీడెడ్ : రూ. 11.55 కోట్లు
  • ఉత్తరాంధ్ర : రూ. 8.05 కోట్లు
  • గుంటూరు : రూ. 6.26 కోట్లు
  • ఈస్ట్ : రూ. 5.23 కోట్లు
  • వెస్ట్ : రూ. 4.25 కోట్లు
  • కృష్ణా : రూ. 3.56 కోట్లు
  • నెల్లూరు : రూ. 2.77 కోట్లు
Tags:    
Advertisement

Similar News