ఎమ్మెల్యేలను దాచిన రిసార్ట్ నుంచి రూ. 998 కోట్లు రికవరీ చేయండి
కర్నాటక కాంగ్రెస్ మరో చిక్కులో పడింది. బీజేపీ వైపు వెళ్తున్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ తన పార్టీ ఎమ్మెల్యేలను ఈగల్టన్ రిసార్ట్‌కు తరలించింది. అక్కడే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కట్టుదిట్టమైన భద్రతా, నిఘా మధ్య ఉంచారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను దాచిన రిసార్ట్ భూమి వివాదంలో ఉంది. 70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి దీన్ని నిర్మించుకున్నారు. దీనిపై వివాదం నడుస్తోంది. ఇటీవలే కుమారస్వామి కేబినెట్‌లో మంత్రిగా ఉన్న దేశ్‌పాండే కూడా ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉందన్నారు. […]
కర్నాటక కాంగ్రెస్ మరో చిక్కులో పడింది. బీజేపీ వైపు వెళ్తున్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ తన పార్టీ ఎమ్మెల్యేలను ఈగల్టన్ రిసార్ట్‌కు తరలించింది. అక్కడే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కట్టుదిట్టమైన భద్రతా, నిఘా మధ్య ఉంచారు.
అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను దాచిన రిసార్ట్ భూమి వివాదంలో ఉంది. 70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి దీన్ని నిర్మించుకున్నారు. దీనిపై వివాదం నడుస్తోంది.
ఇటీవలే కుమారస్వామి కేబినెట్‌లో మంత్రిగా ఉన్న దేశ్‌పాండే కూడా ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉందన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించినందుకు గాను రిసార్ట్ ఓవర్ నుంచి రూ. 998 కోట్లు రికవరీ చేస్తామని ప్రకటించారు.
అలా ప్రకటించిన కొద్ది రోజులకే కుమారస్వామికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఈ వివాదాస్పద రిసార్ట్‌లో ఉంచడంపై బీజేపీ మండిపడుతోంది. 998 కోట్లు రికవరీ చేయాల్సి ఉండగా ఆ పని చేయకుండా వివాదాస్పద రిసార్ట్‌లో ఎమ్మెల్యేలను ఎలా ఉంచారని కర్నాటక బీజేపీ ప్రశ్నించింది. ముందు రిసార్ట్ వారి నుంచి డబ్బు వసూలు చేసి… దాన్ని రైతు రుణమాఫీకి ఉపయోగించాలని బీజేపీ డిమాండ్ చేసింది.
Eagleton resort owe GOK ₹998cr Penalty amount in land encroachment case.
Now that Congress Party will spend time in resort we request ‘Maryada Purushothama’ Sri. @siddaramaiah, @DKShivakumar & @dineshgrao to collect this money while u return
U can use it for farmer loan waiver pic.twitter.com/bAZLbtJU3L
— BJP Karnataka (@BJP4Karnataka) January 19, 2019