"వినయ విధేయ" వారం రోజుల వసూళ్లు
సినిమా ప్లాప్ అయినా ఇప్పటివరకు వచ్చిన వసూళ్లు మాత్రం బాగున్నాయి. రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమా నిన్నటితో 7 రోజుల రన్ పూర్తిచేసుకుంది. ఈ 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 56 కోట్ల రూపాయల నెట్ సాధించింది ఈ సినిమా. ఓవర్సీస్ లో ఇప్పటికే డిజాస్టర్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రేక్-ఈవెన్ అవ్వడం కష్టం అంటోంది ట్రేడ్. దాదాపు 92 కోట్ల రూపాయలకు ఈ సినిమా రైట్స్ అమ్ముడుపోయాయి. […]
Advertisement
సినిమా ప్లాప్ అయినా ఇప్పటివరకు వచ్చిన వసూళ్లు మాత్రం బాగున్నాయి. రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమా నిన్నటితో 7 రోజుల రన్ పూర్తిచేసుకుంది. ఈ 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 56 కోట్ల రూపాయల నెట్ సాధించింది ఈ సినిమా.
ఓవర్సీస్ లో ఇప్పటికే డిజాస్టర్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రేక్-ఈవెన్ అవ్వడం కష్టం అంటోంది ట్రేడ్. దాదాపు 92 కోట్ల రూపాయలకు ఈ సినిమా రైట్స్ అమ్ముడుపోయాయి. ఇప్పటివరకు 56 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఫైనల్ రన్ లో మరో 7 కోట్ల రూపాయలు వచ్చే ఛాన్స్ ఉంది. సో… ఎలా చూసుకున్నప్పటికీ బయ్యర్లుకు 30శాతం నష్టాలు కనిపిస్తున్నాయి
ఇటు నైజాంలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. అటుఇటుగా 23 కోట్ల రూపాయలకు ఈ సినిమా హక్కులు దక్కించుకున్నాడు దిల్ రాజు. కానీ ఈ వారం రోజుల్లో సినిమాకు 12 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. మహా అయితే మరో 3 కోట్లు మాత్రమే వస్తాయి. సో.. ఓవర్సీస్ తర్వాత ఎక్కువగా నష్టపోయేది దిల్ రాజే. ఏపీ, నైజాంలో ఈ సినిమా 7 రోజుల వసూళ్లు (షేర్) ఇలా ఉన్నాయి
నైజాం – రూ. 12.01 కోట్లు
సీడెడ్ – రూ. 10.92 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 6.67 కోట్లు
ఈస్ట్ – రూ. 4.58 కోట్లు
వెస్ట్ – రూ. 3.77 కోట్లు
గుంటూరు – రూ. 6.04 కోట్లు
కృష్ణా – రూ. 3.39 కోట్లు
నెల్లూరు – రూ. 2.62 కోట్లు
Advertisement