నేడు మీసేవ బంద్
ఏపీలో నేడు ”మీసేవ” కేంద్రాలు పనిచేయవు. ”మీసేవ” కేంద్రాల నిర్వాహకులు బంద్ చేస్తున్నారు. పలు డిమాండ్ల సాధన కోసం వారు బంద్ నిర్వహిస్తున్నారు. నకిలీ రికార్డులతో నడస్తున్న ”మీసేవ” కేంద్రాలను మూసివేయాలని నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. మీ సేవా కేంద్రాలకు ఉచిత ఇంటర్‌నెట్, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్నది మరో డిమాండ్. నాలుగు నెలలుగా ”మీసేవ” కేంద్రాల నిర్వాహకులకు చెల్లించాల్సిన కమిషన్ పెండింగ్‌లో ఉంది. దీన్ని కూడా వెంటనే చెల్లించడంతోపాటు కమిషన్‌ను క్రమం తప్పకుండా ప్రతి నెల 5లోగా […]
ఏపీలో నేడు ”మీసేవ” కేంద్రాలు పనిచేయవు. ”మీసేవ” కేంద్రాల నిర్వాహకులు బంద్ చేస్తున్నారు. పలు డిమాండ్ల సాధన కోసం వారు బంద్ నిర్వహిస్తున్నారు.
నకిలీ రికార్డులతో నడస్తున్న ”మీసేవ” కేంద్రాలను మూసివేయాలని నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. మీ సేవా కేంద్రాలకు ఉచిత ఇంటర్‌నెట్, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్నది మరో డిమాండ్.
నాలుగు నెలలుగా ”మీసేవ” కేంద్రాల నిర్వాహకులకు చెల్లించాల్సిన కమిషన్ పెండింగ్‌లో ఉంది. దీన్ని కూడా వెంటనే చెల్లించడంతోపాటు కమిషన్‌ను క్రమం తప్పకుండా ప్రతి నెల 5లోగా ఇచ్చేలా చూడాలని కోరుతున్నారు.
”మీసేవ”కు సంబంధించి హైదరాబాద్‌లో ఉన్న అన్ని కార్యాలయాలను విజయవాడకు తరలించాలని కూడా నిర్వాహకులు కోరుతున్నారు. ఈ డిమాండ్లతో నేడు ”మీసేవ” సెంటర్ల నిర్వాహకులు బంద్ నిర్వహిస్తున్నారు.