వినయ విధేయ పోయింది... అయితే ఏంటి?

రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా పోయినందుకు కచ్చితంగా యూనిట్ అంతా బాధపడుతుంది. రామ్ చరణ్ అయితే పూర్తిగా మీడియాకు కనిపించడం మానేశాడు. బోయపాటి శ్రీను అయితే ఫోన్ సైలెంట్ లో పెట్టేశాడు. కైరా తన పని తాను చేసుకుంటోంది. ఇక డబ్బులు పెట్టిన డీవీవీ దానయ్య పరిస్థితి ఏంటో అని అంతా బాధపడుతున్నారు. కానీ అంత బాధపడాల్సిన అవసరం లేదు. దానయ్య చాలా […]

Advertisement
Update:2019-01-17 12:50 IST

రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా పోయినందుకు కచ్చితంగా యూనిట్ అంతా బాధపడుతుంది. రామ్ చరణ్ అయితే పూర్తిగా మీడియాకు కనిపించడం మానేశాడు. బోయపాటి శ్రీను అయితే ఫోన్ సైలెంట్ లో పెట్టేశాడు. కైరా తన పని తాను చేసుకుంటోంది. ఇక డబ్బులు పెట్టిన డీవీవీ దానయ్య పరిస్థితి ఏంటో అని అంతా బాధపడుతున్నారు. కానీ అంత బాధపడాల్సిన అవసరం లేదు. దానయ్య చాలా హ్యాపీ.

అవును.. వినయ విధేయ రామ సినిమా పోతే ఏమైంది అంటూ రివర్స్ లో ప్రశ్నిస్తున్నాడు దానయ్య. ఈ సినిమాతో దానయ్య సేఫ్ జోన్ లోకి వెళ్లడం ఓ కారణమైతే, రాబోయే ఆర్-ఆర్-ఆర్ సినిమా ఇతడి ఆత్మవిశ్వాసానికి ఉదాహరణగా నిలుస్తోంది.

అవును.. వినయ విధేయ రామ పరాజయ ప్రభావం దానయ్యపై అస్సలు కనిపించడం లేదు. ప్రస్తుత ఈ నిర్మాత దృష్టి మొత్తం ఆర్-ఆర్-ఆర్ ప్రాజెక్టుపైనే ఉంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాతో కాసుల వర్షం కురిపిస్తాననే ధీమాతో ఉన్నాడు దానయ్య. అదే నిజం కూడా.

Tags:    
Advertisement

Similar News