6 పాటలు.. జూక్ బాక్స్ విడుదల

పెద్దగా బజ్ లేకపోయినా తమపని తాను చేసుకుంటూ పోతున్నారు మిస్టర్ మజ్నూయూనిట్ సభ్యులు. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ అంటూ హంగామా చేసిన యూనిట్.. రీసెంట్ గా 2 పాటల్ని విడుదల చేసింది. ఈరోజు ఏకంగా జూక్ బాక్స్ విడుదల చేశారు. అవును.. సంక్రాంతి కానుకగా మిస్టర్ మజ్ను పాటలన్నీ మార్కెట్లోకి వచ్చేశాయి. తమన్ కంపోజ్ చేసిన ఈ పాటల్లో గతంలో విడుదల చేసిన మిస్టర్ మజ్ను టైటిల్ సాంగ్ తో పాటు మరో 2 […]

Advertisement
Update:2019-01-14 13:17 IST

పెద్దగా బజ్ లేకపోయినా తమపని తాను చేసుకుంటూ పోతున్నారు మిస్టర్ మజ్నూయూనిట్ సభ్యులు. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ అంటూ హంగామా చేసిన యూనిట్.. రీసెంట్ గా 2 పాటల్ని విడుదల చేసింది. ఈరోజు ఏకంగా జూక్ బాక్స్ విడుదల చేశారు. అవును.. సంక్రాంతి కానుకగా మిస్టర్ మజ్ను పాటలన్నీ మార్కెట్లోకి వచ్చేశాయి.

తమన్ కంపోజ్ చేసిన ఈ పాటల్లో గతంలో విడుదల చేసిన మిస్టర్ మజ్ను టైటిల్ సాంగ్ తో పాటు మరో 2 పాటలు బాగున్నాయి. ఈ పాటలతో పాటు మిగతా అన్ని పాటలకు శ్రీమణి సాహిత్యం సమకూర్చాడు. అంటే సింగిల్ కార్డు అన్నమాట. మ్యూజిక్ డైరక్టర్ గా తమన్ ఈసారి కూడా క్లిక్ అయ్యాడు. తన సిగ్నేచర్ ట్యూన్స్ 2 ఇచ్చాడు

వెంకీ అట్లూరి డైరక్ట్ చేసిన మిస్టర్ మజ్ను సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను 17 లేదా 18న నిర్వహించాలని అనుకుంటున్నారు. అఖిల్, నిధి అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమాను జనవరి 25న విడుదల చేయాలనుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News