చంద్రబాబు విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ హెడ్‌క్వార్టర్ నుంచి హెచ్చరికలు

ప్రధాన జాతీయ పార్టీలతో పాటు, తెలుగురాష్ట్రాల్లోని దాదాపు అన్ని పార్టీలతోనూ పొత్తు పూర్తి చేసిన చంద్రబాబు… ఇప్పుడు పాత పార్టీలకు మళ్లీ సందేశాలు పంపుతున్నారు. తమతో కలిసి పనిచేయాలని పవన్‌ కల్యాణ్‌కు ఇటీవల పిలుపునిచ్చారు చంద్రబాబు. తాజాగా బీజేపీ విషయంలో చంద్రబాబు చేస్తున్న రాజకీయంపై ఆర్‌ఎస్‌ఎస్ తీవ్రంగా స్పందించింది. బీజేపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌డీఏ నుంచి చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత కూడా పలు సర్వేలు వచ్చే ఎన్నికల్లో కొన్ని సీట్లు తగ్గినా […]

Advertisement
Update:2019-01-13 07:00 IST

ప్రధాన జాతీయ పార్టీలతో పాటు, తెలుగురాష్ట్రాల్లోని దాదాపు అన్ని పార్టీలతోనూ పొత్తు పూర్తి చేసిన చంద్రబాబు… ఇప్పుడు పాత పార్టీలకు మళ్లీ సందేశాలు పంపుతున్నారు. తమతో కలిసి పనిచేయాలని పవన్‌ కల్యాణ్‌కు ఇటీవల పిలుపునిచ్చారు చంద్రబాబు.

తాజాగా బీజేపీ విషయంలో చంద్రబాబు చేస్తున్న రాజకీయంపై ఆర్‌ఎస్‌ఎస్ తీవ్రంగా స్పందించింది. బీజేపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఎన్‌డీఏ నుంచి చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత కూడా పలు సర్వేలు వచ్చే ఎన్నికల్లో కొన్ని సీట్లు తగ్గినా తిరిగి ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నాయి. ఇక్కడే చంద్రబాబుకు చిక్కు వచ్చి పడింది. ఎన్‌డీఏ తిరిగి అధికారంలోకి రాదన్న భావనతో తొందరపడి కూటమి నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌తో చేతులు కలిపారు.

అప్పటి నుంచి మోడీ కూడా చంద్రబాబు మీద గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బీజేపీతోనూ టచ్‌లోకి వెళ్తున్నారు చంద్రబాబునాయుడు. మోడీయేతర కీలక నేతలతో చర్చలు జరిపారు. ఇందులో భాగంగా రాజ్‌నాథ్‌ సింగ్, అరుణ్ జైట్లీ, గడ్కరీలను ఇటీవల చంద్రబాబు కలిసినట్టు వార్తలొస్తున్నాయి.

బీజేపీతో తనకు ఎలాంటి గొడవ లేదు… మోడీని తప్పిస్తే ఎన్నికల తర్వాత తిరిగి బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని ముగ్గురు బీజేపీ మంత్రుల వద్ద చంద్రబాబు చెప్పి వచ్చారు. అయితే రాజ్‌నాథ్‌ సింగ్, అరుణ్ జైట్లీలు చంద్రబాబు మాటలను పెద్దగా పట్టించుకోలేదు. గడ్కరీ మాత్రం చంద్రబాబు మాయలో పడ్డారని ఆర్‌ఎస్‌ఎస్ గుర్తించింది. మోడీని తప్పిస్తే మిమ్మల్ని ప్రధానిని చేసినా మద్దతు ఇస్తానని గడ్కరీ వద్ద చంద్రబాబు ఆశ పెట్టారు.

అదే సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దల వద్దకు బాబా రాందేవ్‌ సాయంతో చంద్రబాబు వెళ్లారని ఒక ప్రముఖ పత్రిక కథనం. మోడీని తప్పిస్తే ఎన్‌డీఏకు చంద్రబాబు అండగా ఉంటారని బాబా రాందేవ్‌ ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌కు చంద్రబాబు చెప్పించారు. అయితే బీజేపీ అంతర్గత విషయాల్లో చంద్రబాబు జోక్యం చేసుకోవడంతో పాటు, పార్టీ అగ్రనేతల మధ్య ప్రధాని పదవి కోసం చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని గుర్తించిన ఆర్‌ఎస్‌ఎస్‌ పార్టీ నేతలకు హెడ్‌ క్వార్టర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

అసహ్యమైన రాజకీయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ”టీడీపీతో బీజేపీకి పరోక్షంగా, ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధాలు లేవు. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నేతలు వ్యవహరించాలి” అని స్పష్టం చేసింది. ”చంద్రబాబు బీజేపీ అగ్రనేతల మధ్య చిచ్చు రాజేయాలని ప్రయత్నించారని.. కానీ పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్ సకాలంలో గుర్తించడంతో చంద్రబాబు ఎత్తులు పారలేదని, ఇలాంటి అవకాశవాద రాజకీయ నాయకుడిని తామెన్నడూ చూడలేదు” అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఒకరు వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News