చీటింగ్‌ కేసులో అరెస్ట్‌... ఆడోమగో తెలియక హైరానా

హైదరాబాద్‌ కుషాయిగూడ పోలీసులకు వింత కేసు తగిలింది. కొన్ని రోజుల క్రితం కార్లు అద్దెకు ఇచ్చే ఏజెన్సీ నుంచి కుషాయిగూడ పోలీసులకు ఒక ఫిర్యాదు అందింది. ఇద్దరు వ్యక్తులు తమ వద్ద కార్లు అద్దెకు తీసుకెళ్లి వాటిని అమ్మేశారని ఫిర్యాదులో వివరించారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన కుషాయిగూడ పోలీసులు పోతులయ్య, సిరాజ్‌ హుస్సేన్‌ను అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి వారి వివరాలను ఫైల్‌ చేస్తున్న సమయంలో సిరాజ్‌… తాను మగాడిని కాదని… జెండర్‌ను స్త్రీగా […]

Advertisement
Update:2019-01-12 05:27 IST

హైదరాబాద్‌ కుషాయిగూడ పోలీసులకు వింత కేసు తగిలింది. కొన్ని రోజుల క్రితం కార్లు అద్దెకు ఇచ్చే ఏజెన్సీ నుంచి కుషాయిగూడ పోలీసులకు ఒక ఫిర్యాదు అందింది. ఇద్దరు వ్యక్తులు తమ వద్ద కార్లు అద్దెకు తీసుకెళ్లి వాటిని అమ్మేశారని ఫిర్యాదులో వివరించారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన కుషాయిగూడ పోలీసులు పోతులయ్య, సిరాజ్‌ హుస్సేన్‌ను అరెస్ట్ చేశారు.

పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి వారి వివరాలను ఫైల్‌ చేస్తున్న సమయంలో సిరాజ్‌… తాను మగాడిని కాదని… జెండర్‌ను స్త్రీగా రాయాలని కోరాడు. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. నీవు మగాడివి కాదా అని ప్రశ్నించగా… ఒకప్పుడు తాను మగాడినని సిరాజ్ సమాధానం ఇచ్చాడు. ముంబై వెళ్లి లింగమార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్నానని వివరించాడు.

సిరాజ్‌ చెప్పిన దాని ఆధారంగా వివరాలు నోట్ చేసుకునేందుకు సంశయించిన పోలీసులు వైద్యులను ఆశ్రయించారు. పోతులయ్యను అరెస్ట్ చేశామని…. సిరాజ్‌ ఆడో మగో నిర్ధారించేందుకు ప్రభుత్వ ఆస్పత్రికి పంపించామని కుషాయిగూడ సీఐ చంద్రశేఖర్ వివరించారు.

రిపోర్టు రావడానికి కొన్ని రోజులు పడుతుందని… ఆ తర్వాత సిరాజ్ వ్యవహారంలో ముందుకెళ్తామని వివరించారు.

Advertisement

Similar News