ఎంపీ కవిత ఆసక్తికర ట్వీట్.... ఈబీసీపై ఏమన్నారంటే...!

ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల వారికి 10శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రవేశపెట్టిన ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. ఆ బిల్లును ప్రవేశపెట్టిన రోజే అన్ని అడ్డంకులను ఎదుర్కొని…. క్లియర్ అయ్యింది. అంతేకాదు లోక్‌స‌భ‌లోనూ, రాజ్య‌స‌భ‌లోనూ ఆ బిల్లు చాలా వేగంగా ఆమోదం పొందింది. ఆ బిల్లును టీఆర్ఎస్ ఎంపీలు కూడా స్వాగ‌తించారు. If the WomenReservation Bill could be passed with the same speed with […]

Advertisement
Update:2019-01-10 08:46 IST

ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల వారికి 10శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రవేశపెట్టిన ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది.

ఆ బిల్లును ప్రవేశపెట్టిన రోజే అన్ని అడ్డంకులను ఎదుర్కొని…. క్లియర్ అయ్యింది. అంతేకాదు లోక్‌స‌భ‌లోనూ, రాజ్య‌స‌భ‌లోనూ ఆ బిల్లు చాలా వేగంగా ఆమోదం పొందింది. ఆ బిల్లును టీఆర్ఎస్ ఎంపీలు కూడా స్వాగ‌తించారు.

అయితే అంతే వేగంగా మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును కూడా పార్ల‌మెంట్ ఆమోదించాల‌ని… టీఆర్ఎస్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత అభిప్రాయ‌ప‌డ్డారు. ఈబీసీ బిల్లును ఎంత వేగంగా పాస్ చేశారో.. అంతే స్పీడ్‌తో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును ఆమోదిస్తే.. దేశం నిజంగానే ప్రగ‌తి సాధిస్తుంద‌ని ఆమె అన్నారు.

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుకు పార్ల‌మెంట్‌లో ఆమోదం ద‌క్కాలంటే, దానికి బ‌ల‌మైన రాజ‌కీయ సంక‌ల్పం ఉండాల‌ని ఎంపీ క‌విత తెలిపారు.

చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న ఉద్దేశంతో గ‌తంలో పార్ల‌మెంట్ లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. అయితే ఆ బిల్లు రాజ్య‌స‌భ‌లో ఇంకా పెండింగ్‌లోనే ఉన్న‌ది.

Tags:    
Advertisement

Similar News