కొత్త పంథాలో దూసుకెళ్తున్న తెలంగాణ పోలీసులు

తెలంగాణ పోలీసులు తమదైన శైలిలో పనిచేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ద్వారా ఇప్పటికే సామాన్యులకు చేరువైన తెలంగాణ పోలీసులు… మరో అడుగు ముందుకేస్తున్నారు. ప్రజలకు తమ నుంచి మరింత మెరుగ్గా సేవలందించేందుకు కొత్త పంథాకు శ్రీకారం చుట్టారు. ఎఫ్‌ఐఆర్‌ కూడా ఇంటి వద్దకే వచ్చి రికార్డు చేసే సదుపాయాన్ని ప్రజలకు అందించబోతున్నారు. కొత్త ఏడాదిలో ప్రజలకు చేరువయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై  తెలంగాణ పోలీసులు…. 15 రోజుల పాటు ప్రజల వద్దకు వెళ్లనున్నారు. గ్రామాలు, పట్టణాల్లోని కాలనీలు, అపార్ట్‌మెంట్లు, వ్యాపార […]

Advertisement
Update:2019-01-06 03:40 IST

తెలంగాణ పోలీసులు తమదైన శైలిలో పనిచేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ద్వారా ఇప్పటికే సామాన్యులకు చేరువైన తెలంగాణ పోలీసులు… మరో అడుగు ముందుకేస్తున్నారు. ప్రజలకు తమ నుంచి మరింత మెరుగ్గా సేవలందించేందుకు కొత్త పంథాకు శ్రీకారం చుట్టారు. ఎఫ్‌ఐఆర్‌ కూడా ఇంటి వద్దకే వచ్చి రికార్డు చేసే సదుపాయాన్ని ప్రజలకు అందించబోతున్నారు.

కొత్త ఏడాదిలో ప్రజలకు చేరువయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ పోలీసులు…. 15 రోజుల పాటు ప్రజల వద్దకు వెళ్లనున్నారు. గ్రామాలు, పట్టణాల్లోని కాలనీలు, అపార్ట్‌మెంట్లు, వ్యాపార సముదాయాలకు వెళ్లి అక్కడి వారితో చర్చలు జరపనున్నారు. ప్రజలు, వ్యాపారులు పోలీస్ శాఖ నుంచి ఎలాంటి సేవలు ఆశిస్తున్నారో అడిగి తెలుసుకోనున్నారు.

ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్‌ను స్థానిక పోలీసులు పై అధికారులకు చేరవేస్తారు. వారు జిల్లా ఎస్పీలకు తెలియజేస్తారు. ఇలా అన్ని జిల్లాల నుంచి ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాత డీజీపీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ప్రజలు కోరుకుంటున్న సేవలను అందుబాటులోకి తేనున్నారు.

ఇప్పటి వరకు మహిళలకు సంబంధించిన కేసుల్లో పోలీసులే బాధితుల ఇళ్లకు వెళ్లి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసేవారు. ఈ తరహా సేవలను అన్ని చోట్లా విస్తరించాలని తెలంగాణ పోలీసులు నిర్ణయించుకున్నారు. ప్రత్యేకమైన యాప్ సాయంతో సంఘటనా స్థలిలోనే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నారు. ఇందుకు టీఎస్‌ కాప్‌ యాప్‌ను వినియోగిస్తారు.

ఈ కొత్త తరహా సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు జిల్లా ఎస్పీలు, కమిషనర్లు, డీసీపీలతో డీజీపీ మహేందర్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఏడాది చేపట్టబోతున్న కొత్త పోలీసింగ్‌ విధానం అమలు కోసం ప్రతీ ఒక్కరు అంకితభావంతో పనిచేయాలని, త్వరలోనే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను తెలియజేస్తామని డీజీపీ వివరించారు.

Tags:    
Advertisement

Similar News