దెబ్బకు దెబ్బ అంటున్న తెలుగుదేశం

దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంతటి పటిష్టమైన పార్టీ నిర్మాణం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఒక సామాజిక వర్గం మొత్తం ఆ పార్టీని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది. మార్క్స్‌ ఎంగెల్స్‌…. ప్రపంచ కార్మికులారా ఏకం కండి…. అని పిలుపునిస్తే ఏకం కాలేదు. కానీ చంద్రబాబు వాళ్ళకన్నా గొప్పవాడేమో! మనవాళ్ళంతా ఏకం కండి అంటే…. ఒక్క తాటిమీద నిల్చి పోరాడుతున్నారు…. చివరికి ఆంధ్రప్రదేశ్‌ లో ఉండే నారాయణ లాంటి ఉభయ కమ్యూనిస్టు పార్టీలలోని అధినాయకులు కూడా చంద్రబాబు పిలుపుకు […]

Advertisement
Update:2019-01-05 13:17 IST

దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంతటి పటిష్టమైన పార్టీ నిర్మాణం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఒక సామాజిక వర్గం మొత్తం ఆ పార్టీని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది. మార్క్స్‌ ఎంగెల్స్‌…. ప్రపంచ కార్మికులారా ఏకం కండి…. అని పిలుపునిస్తే ఏకం కాలేదు. కానీ చంద్రబాబు వాళ్ళకన్నా గొప్పవాడేమో! మనవాళ్ళంతా ఏకం కండి అంటే…. ఒక్క తాటిమీద నిల్చి పోరాడుతున్నారు…. చివరికి ఆంధ్రప్రదేశ్‌ లో ఉండే నారాయణ లాంటి ఉభయ కమ్యూనిస్టు పార్టీలలోని అధినాయకులు కూడా చంద్రబాబు పిలుపుకు తీవ్రంగా స్పందించి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు.

బహుశా ప్రపంచంలో ఏ పార్టీకి ఒక సామాజిక వర్గం నుంచి ఇంత సపోర్టు లభించి ఉండదేమో!

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయే అవకాశాలున్నాయని తెలుస్తున్న కొద్ది…. ఒక్కొక్కళ్ళు ఒక్కో యోధుడిలా పోరాడుతున్నారు…. వాళ్ళ వాళ్ళ రంగాలలో.

తమ వాళ్ళను ఏదైనా అంటే…. రోజులు గడవక ముందే దెబ్బకు దెబ్బ అంటున్నారు.

శుక్రవారం నాడు కాకినాడలో చంద్రబాబును బీజేపీ నాయకులు నిలదీసేసరికి…. శనివారం ఉదయం గుంటూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటిని ముట్టడించారు.

రెండు మూడు రోజుల క్రితం నటుడు నాగబాబు బాలయ్య గురించి రెండు మూడు ఫేస్‌బుక్‌ పోస్టులు పెట్టేసరికి…. శుక్రవారం నాడు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు.

చెన్నైలో ఓ కాలేజీలో మాట్లాడడానికి వెళ్ళిన నాగబాబును…. మాట్లాడడానికి లేచి మైక్‌ చేతిలోకి తీసుకోగానే…. ఆయనను మాట్లాడనివ్వకుండా…. వెళ్ళిపోయేదాక “జై బాలయ్య… జై జై బాలయ్య” అంటూ నాగబాబును మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు, అవమానించారు.

అయితే మెగా ఫ్యామిలీ అభిమానులను తక్కువ అంచనా వేయలేం. వాళ్ళు తలుచుకుంటే…. ఎవ్వరికైనా చుక్కలు చూపిస్తారు. నాగబాబుకు ఇలాంటి అవమానం జరిగాక వాళ్ళు ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.

Tags:    
Advertisement

Similar News